గెలిచినందుకు రాజీనామా చేశారు
దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ నేతలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ తమ పదవులకు రాజీనామా చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత.. తమ ఎమ్మెల్సీ, మంత్రి పదవులకు 14 రోజుల లోపు రాజీనామా చేయాలి. ఇందులో భాగంగానే మంత్రి పదవుల రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు పంపగా.. ఎమ్మెల్సీ రాజీనామా లేఖలను మండలి చైర్మన్‌కు పంపారు. కాగా, వీరి ఎమ్మెల్సీ పదవుల రాజీనామాకు మండలి చైర్మన్ ఆమోదం తెలిపారు. రాజీనామా అనంతరం పిల్లి సుభాష్ […]
దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ నేతలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ తమ పదవులకు రాజీనామా చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత.. తమ ఎమ్మెల్సీ, మంత్రి పదవులకు 14 రోజుల లోపు రాజీనామా చేయాలి. ఇందులో భాగంగానే మంత్రి పదవుల రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు పంపగా.. ఎమ్మెల్సీ రాజీనామా లేఖలను మండలి చైర్మన్‌కు పంపారు. కాగా, వీరి ఎమ్మెల్సీ పదవుల రాజీనామాకు మండలి చైర్మన్ ఆమోదం తెలిపారు.
రాజీనామా అనంతరం పిల్లి సుభాష్ మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం సీఎం జగన్ సుదీర్ఘ పోరాటం చేశారని చెబుతూనే.. ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం లేదన్నారు. ఇది కేవలం తన వ్యక్తి గత అభిప్రాయమని స్పష్టం చేశారు. రఘురామకృష్ణం రాజు వ్యవహారంపై స్పందించిన ఆయన.. ఎంపీలు ఎవరైనా సరే పార్టీకి విధేయులుగా ఉండాలని సూచించారు. పార్లమెంట్‌కు వెళ్లాలనేది తన చిరకాల కోరిక అని పిల్లి సుభాష్ ఈ సందర్భంగా తెలియజేశారు.