కోవిడ్ సెంటర్‌లో పందులు.. వీడియో వైరల్

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరలవుతోంది. ఆ వీడియో కర్ణాటక ప్రభుత్వం పరువు తీసేలా ఉంది. ఈ ఊదంతంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని ఒక కోవిడ్ సెంటర్ లో పందులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. ఇది గమనించిన ఓ వ్యక్తి వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇప్పుడది వైరలవుతోంది. అది చూసిన నెటిజన్లు కోవిడ్ రోగులకు ట్రీట్ మెంట్ ఇచ్చే తీరు ఇదేనా..? […]

Update: 2020-07-19 23:28 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరలవుతోంది. ఆ వీడియో కర్ణాటక ప్రభుత్వం పరువు తీసేలా ఉంది. ఈ ఊదంతంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని ఒక కోవిడ్ సెంటర్ లో పందులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. ఇది గమనించిన ఓ వ్యక్తి వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇప్పుడది వైరలవుతోంది. అది చూసిన నెటిజన్లు కోవిడ్ రోగులకు ట్రీట్ మెంట్ ఇచ్చే తీరు ఇదేనా..? అంటూ సర్కారుపై మండిపడుతున్నాయి. ఇటు ఈ ఉదంతంపై ఆ రాష్ట్ర మంత్రి శ్రీరాములు అధికారులపై ఫైరయ్యారు. క్వారంటైన్ సెంటర్ లోకి పందులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఈ ఒక్క వీడియో చాలు యడ్డి సర్కారు ఎంతలా ఫెయిల్ అయ్యిందో చెప్పడానికి అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి.

Tags:    

Similar News