జగిత్యాలలో కరోనా మరణం
దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినా రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. జగిత్యాల జిల్లాలో కూడా కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కరోనా లక్షణాలతో జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోని ఐసోలేషన్‌లో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకివెళితే .. కోడిమ్యాల మండలం సండ్రాల పల్లి గ్రామానికి చెందిన 38ఏండ్ల వికలాంగుడు వైరస్‌తో చికిత్స పొందుతూ తనువు […]
దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినా రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. జగిత్యాల జిల్లాలో కూడా కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కరోనా లక్షణాలతో జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోని ఐసోలేషన్‌లో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు.
వివరాల్లోకివెళితే .. కోడిమ్యాల మండలం సండ్రాల పల్లి గ్రామానికి చెందిన 38ఏండ్ల వికలాంగుడు వైరస్‌తో చికిత్స పొందుతూ తనువు చాలించాడు. కాగా, అతని శాంపిల్స్‌ను వైద్యులు పరీక్షలకు పంపించారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచినట్లు ఆస్పత్రి సిబ్బంది వెల్లడించారు.