దేశ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. అందుకే బాక్సింగ్‌కు గుడ్ బై చెప్తున్నా..

దిశ, స్పోర్ట్స్: ఫిలిప్పైన్స్‌కు చెందిన స్టార్ బాక్సర్ మానీ పక్యావ్ ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు బుధవారం ప్రకటించాడు. 2022 మేలో ఫిలిప్పైన్స్ దేశ అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఆ ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్లు గతంలోనే పేర్కొన్న పక్యావ్.. ఎన్నికలపై దృష్టి పెట్టడానికే బాక్సింగ్ కెరీర్‌కు గుడ్ బై చెబుతున్నట్లు తెలిపాడు. 2016 నుంచి సెనేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. అంతకుముందు ఫిలిప్పైన్స్‌ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటీవ్స్‌కు రెండుసార్లు ప్రాతినిథ్యం వహించాడు. ‘ప్రపంచలోని గ్రేటెస్ట్ స్పోర్ట్, గ్రేటెస్ట్ ఫ్యాన్స్‌కు చాలా […]

Update: 2021-09-29 10:14 GMT

దిశ, స్పోర్ట్స్: ఫిలిప్పైన్స్‌కు చెందిన స్టార్ బాక్సర్ మానీ పక్యావ్ ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు బుధవారం ప్రకటించాడు. 2022 మేలో ఫిలిప్పైన్స్ దేశ అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఆ ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్లు గతంలోనే పేర్కొన్న పక్యావ్.. ఎన్నికలపై దృష్టి పెట్టడానికే బాక్సింగ్ కెరీర్‌కు గుడ్ బై చెబుతున్నట్లు తెలిపాడు. 2016 నుంచి సెనేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. అంతకుముందు ఫిలిప్పైన్స్‌ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటీవ్స్‌కు రెండుసార్లు ప్రాతినిథ్యం వహించాడు. ‘ప్రపంచలోని గ్రేటెస్ట్ స్పోర్ట్, గ్రేటెస్ట్ ఫ్యాన్స్‌కు చాలా చాలా ధన్యవాదములు. నా జీవితంలో తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయం ఇదే. కానీ, నేను చాలా ప్రశాంతంగానే ఉన్నాను. నా కలలను సాకారం చేసుకునే దిశగా వెళ్లే క్రమంలోనే ఆటకు వీడ్కోలు చెప్పాను. గుడ్ బై బాక్సింగ్’ అని ఒక ట్వీట్‌లో పేర్కొన్నాడు.


Similar News