పీహెచ్‌సీ ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ

దిశ, సంగారెడ్డి: హత్నూర పీహెచ్‌సీ సంగారెడ్డి డీఎంహెచ్ఓ మోజీరామ్ రాథోడ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కరోనా మహమ్మారి దృష్ట్యా ప్రజలంతా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు. అంతేగాకుండా ప్రతిరోజూ రెండు లేదా మూడుసార్లు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని తెలిపారు. అనంతరం పీహెచ్సీలో చేస్తున్న రాపిడ్ టెస్టులను ఆయన పరిశీలించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పని ఉంటే తప్ప బయటికి రాకూడదని, ఎవరికి వారే గృహ నిర్భందం […]

Update: 2020-08-12 08:41 GMT

దిశ, సంగారెడ్డి: హత్నూర పీహెచ్‌సీ సంగారెడ్డి డీఎంహెచ్ఓ మోజీరామ్ రాథోడ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కరోనా మహమ్మారి దృష్ట్యా ప్రజలంతా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు. అంతేగాకుండా ప్రతిరోజూ రెండు లేదా మూడుసార్లు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని తెలిపారు.

అనంతరం పీహెచ్సీలో చేస్తున్న రాపిడ్ టెస్టులను ఆయన పరిశీలించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పని ఉంటే తప్ప బయటికి రాకూడదని, ఎవరికి వారే గృహ నిర్భందం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News