ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న ఇంధన ధరలు..

దిశ, వెబ్‌డెస్క్ : ఓ వైపు కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తుంటే మరోవైపు ఇంధన ధరలు ఆకాశమే హద్దుగా పైపైకి దూసుకుపోతున్నాయి. ఇంధన ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సామాన్యుడి నెత్తిన పెనుభారం పడుతోంది. దీనికితోడు నిత్యావసరాల ధరలు కూడా పెరగడంతో దిక్కతోచని స్థితిలో మధ్య తరగతి ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ఇదిలాఉండగా దేశంలో పెట్రోల్, డీజిల్ చార్జీలు వరుసగా బుధవారం కూడా పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 25పైసలు, డీజిల్ పై 26 పైసలు పెరిగింది. తాజా […]

Update: 2021-06-08 21:18 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఓ వైపు కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తుంటే మరోవైపు ఇంధన ధరలు ఆకాశమే హద్దుగా పైపైకి దూసుకుపోతున్నాయి. ఇంధన ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సామాన్యుడి నెత్తిన పెనుభారం పడుతోంది. దీనికితోడు నిత్యావసరాల ధరలు కూడా పెరగడంతో దిక్కతోచని స్థితిలో మధ్య తరగతి ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ఇదిలాఉండగా దేశంలో పెట్రోల్, డీజిల్ చార్జీలు వరుసగా బుధవారం కూడా పెరిగాయి.

లీటర్ పెట్రోల్‌పై 25పైసలు, డీజిల్ పై 26 పైసలు పెరిగింది. తాజా పెంపుతో విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.55, డీజిల్ రూ.95.90కు చేరుకోగా, హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.99.32, డీజిల్ రూ.94.26గా ఉంది. కరోనా మహమ్మారి నియంత్రణకు విధించిన లాక్‌డౌన్ వలన చాలా మంది ప్రజలు ఉపాధి కరువై ఇబ్బందులు పడుతుంటే కేంద్రం వరుసగా ఇంధన ధరలు పెంచడం పట్ల సామాన్య జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News