పెట్రోల్ మంట తగ్గేనా..?

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో  పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ సామాన్యులను ఆర్థిక ఇబ్బందుల్లో నెట్టేస్తున్నాయి. ఓ వైపు నిత్యావసర సరకుల ధరలు, మరోవైపు పెట్రోల్ ధరలతో సామాన్యుని పరిస్థితి అస్థవ్యస్తంగా మారింది. వరసగా ఐదోసారి ఇంధన ధరలు పెరిగాయి. శనివారం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై రూ. 30 పైసల వరకు పెరిగి రూ. 107.71కి చేరింది. ఇక డీజిల్ ధర కూడా పెట్రోల్ బాటలోనే ప్రయాణిస్తూ రూ. 0.22పైసలు పెరిగి రూ. 101.33గా ఉంది. […]

Update: 2021-10-08 22:21 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ సామాన్యులను ఆర్థిక ఇబ్బందుల్లో నెట్టేస్తున్నాయి. ఓ వైపు నిత్యావసర సరకుల ధరలు, మరోవైపు పెట్రోల్ ధరలతో సామాన్యుని పరిస్థితి అస్థవ్యస్తంగా మారింది. వరసగా ఐదోసారి ఇంధన ధరలు పెరిగాయి. శనివారం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై రూ. 30 పైసల వరకు పెరిగి రూ. 107.71కి చేరింది. ఇక డీజిల్ ధర కూడా పెట్రోల్ బాటలోనే ప్రయాణిస్తూ రూ. 0.22పైసలు పెరిగి రూ. 101.33గా ఉంది. అలాగే విజయవాడ (Vijayawada) మార్కెట్‌లో పెట్రోల్ ధరలు స్వల్పంగా పెరిగి రూ.109.70 గా ఉంది. డీజిల్ ధర రూ.101.74కు చేరింది.

Tags:    

Similar News