సుప్రీంలో పిటిషన్ వేస్తే లక్ష కట్టమన్నారు

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికను సవాల్ చేసిన పిటిషనర్‌కు సుప్రీంకోర్టు రూ. లక్ష జరిమానా విధించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే పిటిషన్‌ను స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ ఎంపీగా పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. అయితే, అదే నియోజకవర్గం నుంచి రాహుల్ ఎన్నిక కావడాన్ని సవాల్ చేస్తూ.. కేరళ రాష్ట్రంలో రెండు సార్లు సోలార్ ప్యానెల్ కుంభకోణంలో ఉన్న నిందితురాలు సరిత […]

Update: 2020-11-02 08:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికను సవాల్ చేసిన పిటిషనర్‌కు సుప్రీంకోర్టు రూ. లక్ష జరిమానా విధించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే పిటిషన్‌ను స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ ఎంపీగా పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. అయితే, అదే నియోజకవర్గం నుంచి రాహుల్ ఎన్నిక కావడాన్ని సవాల్ చేస్తూ.. కేరళ రాష్ట్రంలో రెండు సార్లు సోలార్ ప్యానెల్ కుంభకోణంలో ఉన్న నిందితురాలు సరిత నాయర్ పిటిషన్ వేశారు. ఈ వ్యవహారం పై విచారణ జరిపి జస్టీస్ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్‌ పై మండిపడింది. ఇలా పనికిరాని పిటిషన్లు వేసి కోర్టు సమయం వృథా చేశారంటూ.. అందుకోసం శిక్ష కింద రూ. లక్ష జరిమానా కట్టాల్సిందే అంటూ తీర్పునిచ్చింది.

Tags:    

Similar News