సీఎం కేసీఆర్‌కి షాకిచ్చిన రైతులు.. హైకోర్టులో పిటిషన్
దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 17న నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. దీంతో పార్టీలన్నీ గత కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. గ్రామగ్రామన తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నాయి. ప్రచారంలో భాగంగా ఈ నెల 14న సీఎం కేసీఆర్ బహిరంగ సభకు టీఆర్‌ఎస్ శ్రేణులు ఏర్పాటు చేస్తున్నాయి. అయితే సీఎం సభకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి.సీఎం సభను రద్దు చేయాలని రైతులు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న హైకోర్టు అత్యవసర అనుమతి […]
దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 17న నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. దీంతో పార్టీలన్నీ గత కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. గ్రామగ్రామన తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నాయి. ప్రచారంలో భాగంగా ఈ నెల 14న సీఎం కేసీఆర్ బహిరంగ సభకు టీఆర్‌ఎస్ శ్రేణులు ఏర్పాటు చేస్తున్నాయి.
అయితే సీఎం సభకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి.సీఎం సభను రద్దు చేయాలని రైతులు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న హైకోర్టు అత్యవసర అనుమతి నిరాకరించడంతో మరోసారి చీఫ్ జస్టీస్ బెంచ్ దగ్గర ఇవాళ రైతులు పిటిషన్ దాఖలు చేశారు. తమ అనుమతి లేకుండా తమ భూముల్లో సభ పెడుతున్నారని పిటిషన్ వేశారు.