బిగ్ బ్రేకింగ్ : తెలంగాణలో డిగ్రీ పరీక్షలపై హైకోర్టులో పిటిషన్

దిశ,వెబ్‌డెస్క్ : కరోనాతో తెలంగాణలో ఇంటర్, డిగ్రీ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కాస్త తగ్గడంతో తెలంగాణలో డిగ్రీ పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. నేటి నుంచి పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలో డిగ్రీ పరీక్షలను.. భౌతికంగా కాకుండా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను విచారించిన హై కోర్టు.. పరీక్షలు […]

Update: 2021-07-05 00:50 GMT

దిశ,వెబ్‌డెస్క్ : కరోనాతో తెలంగాణలో ఇంటర్, డిగ్రీ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కాస్త తగ్గడంతో తెలంగాణలో డిగ్రీ పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. నేటి నుంచి పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలో డిగ్రీ పరీక్షలను.. భౌతికంగా కాకుండా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను విచారించిన హై కోర్టు.. పరీక్షలు ఉదయం 10 గంటలకే ప్రారంభం అయినట్టు గుర్తు చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. పిల్ పై లంచ్ మోషన్ అడిగిన లాయర్ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.

Tags:    

Similar News