ఫెలోషిప్ అక్రమాలపై పిల్ దాఖలు

దిశ, తెలంగాణ బ్యూరో : ఓయూ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల ఫెలోషిప్‌ల మంజూరులో అక్రమాలు జరిగాయని పీహెచ్‌డీ విద్యార్థి కె.శ్రీనివాస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ విషయంపై సీబీఐ విచారణ జరిపించాలన్న పిటీషనర్ అభ్యర్థనను హైకోర్టు విచారణకు స్వీకరించింది. యూజీసీ మార్గదర్శకాలకు విరుద్ధంగా అనర్హులకు ఫెలోషిప్‌లు మంజూరయ్యాయని పిటీషనర్ పేర్కొన్నారు. ఉస్మానియా, కాకతీయ వర్సిటీల్లో ఈ అక్రమాలు జరిగాయంటూ పిటిషనర్​ ఆరోపించారు. పిటిషన్​ను విచారణకు స్వీకరించిన హైకోర్టు కేంద్ర ప్రభుత్వం, యూజీసీ, ఓయూ, కేయూలకు నోటీసులు […]

Update: 2020-12-24 11:28 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఓయూ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల ఫెలోషిప్‌ల మంజూరులో అక్రమాలు జరిగాయని పీహెచ్‌డీ విద్యార్థి కె.శ్రీనివాస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ విషయంపై సీబీఐ విచారణ జరిపించాలన్న పిటీషనర్ అభ్యర్థనను హైకోర్టు విచారణకు స్వీకరించింది. యూజీసీ మార్గదర్శకాలకు విరుద్ధంగా అనర్హులకు ఫెలోషిప్‌లు మంజూరయ్యాయని పిటీషనర్ పేర్కొన్నారు.

ఉస్మానియా, కాకతీయ వర్సిటీల్లో ఈ అక్రమాలు జరిగాయంటూ పిటిషనర్​ ఆరోపించారు. పిటిషన్​ను విచారణకు స్వీకరించిన హైకోర్టు కేంద్ర ప్రభుత్వం, యూజీసీ, ఓయూ, కేయూలకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం గడువు విధించింది.

Tags:    

Similar News