పెంపుడు కుక్క కోసం ఇంత సాహసమా!
దిశ, వెబ్‌డెస్క్ : పెంపుడు జంతువులను ఇంట్లో కుటుంబ సభ్యుల్లా చూసుకుంటుంటారు. వాటికి పుట్టినరోజులు, పండగలు ఇతర వేడుకలు చేస్తుంటారు. అవి అర్థాంతరంగా చనిపోతే చాలా బాధపడతారు. వీలైనంత మేరకు వాటిని కాపాడటానికి ప్రయత్నిస్తారు. కానీ ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను కాపాడేందుకు చేసిన పని చూస్తే.. మరీ ఇంతనా? అనిపిస్తుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో మొసళ్లు తరచుగా కనిపిస్తుంటాయి. ఇళ్లలో, స్విమ్మింగ్ పూల్స్‌లో, గోల్ఫ్ కోర్సుల్లో అటుఇటు తిరుగుతూ తచ్చాడుతుంటాయి. రిచర్డ్ విల్‌బ్యాంక్స్ […]
దిశ, వెబ్‌డెస్క్ : పెంపుడు జంతువులను ఇంట్లో కుటుంబ సభ్యుల్లా చూసుకుంటుంటారు. వాటికి పుట్టినరోజులు, పండగలు ఇతర వేడుకలు చేస్తుంటారు. అవి అర్థాంతరంగా చనిపోతే చాలా బాధపడతారు. వీలైనంత మేరకు వాటిని కాపాడటానికి ప్రయత్నిస్తారు. కానీ ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను కాపాడేందుకు చేసిన పని చూస్తే.. మరీ ఇంతనా? అనిపిస్తుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో మొసళ్లు తరచుగా కనిపిస్తుంటాయి. ఇళ్లలో, స్విమ్మింగ్ పూల్స్‌లో, గోల్ఫ్ కోర్సుల్లో అటుఇటు తిరుగుతూ తచ్చాడుతుంటాయి. రిచర్డ్ విల్‌బ్యాంక్స్ బ్యాక్‌యార్డ్‌లో ఉన్న కొలనులోకి కూడా ఒక మొసలి వచ్చింది. కొలను పక్కన ఆడుకుంటున్న రిచర్డ్ కుక్క గన్నర్‌ను ఆ మొసలి పట్టుకుని, నీళ్లలోకి తీసుకెళ్లింది.
అక్కడే ఉన్న 74 ఏళ్ల రిచర్డ్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ మొసలిని పట్టుకున్నాడు. నీళ్లలో ఉన్నప్పుడు మొసలి ఎంత బలంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయినప్పటికీ ప్రమాదాన్ని లెక్క చేయకుండా రిచర్డ్ నీళ్లలోకి దూకి మొసలిని పట్టుకున్నాడు. అలా గట్టిగా పట్టుకుని, దాని రెండు దవడలను బలంగా వేరు చేసి, ఆ దవడల మధ్యన ఇరుక్కుని బిక్కుబిక్కుమంటున్న తన కుక్కను కాపాడుకున్నాడు. ఈ క్రమంలో గన్నర్‌కు కడుపు మీద చిన్న గాయం కాగా, రిచర్డ్‌కు చేతి మీద మొసలి పళ్లు గీరుకుపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎంతైనా పెంపుడు జంతువు కూడా ఫ్యామిలీ మెంబర్‌తో సమానమే కదా!