ఆత్మహత్య ఆలోచనలతో షమీ.. వెన్నంటే ఉన్న కుటుంబ సభ్యులు

ముంబై/కోల్‌కతా: టీమ్ ఇండియా పేస్ దళంలో మహ్మద్ షమీ ప్రస్తుతం కీలక సభ్యుడిగా ఉన్నాడు. బంగాల్‌కు చెందిన ఈ క్రికెటర్ ఇప్పుడంటే టాప్ పొజిషన్‌లో ఉన్నాడు కానీ, ఐదేండ్ల క్రితం అతడిని గమనించిన వాళ్లు కెరీర్ ముగిసిందనే భావించారు. 2015లో వరల్డ్ కప్‌ తర్వాత షమీని అనేక సమస్యలు చుట్టుముట్టాయి. ఒకవైపు కెరీర్ గాడి తప్పడంతో పాటు కుటుంబ కలహాలు అతడిని మానసికంగా కృంగదీశాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనపై గృహహింస కేసు పెట్టడమే కాక.. […]

Update: 2020-05-03 04:43 GMT

ముంబై/కోల్‌కతా: టీమ్ ఇండియా పేస్ దళంలో మహ్మద్ షమీ ప్రస్తుతం కీలక సభ్యుడిగా ఉన్నాడు. బంగాల్‌కు చెందిన ఈ క్రికెటర్ ఇప్పుడంటే టాప్ పొజిషన్‌లో ఉన్నాడు కానీ, ఐదేండ్ల క్రితం అతడిని గమనించిన వాళ్లు కెరీర్ ముగిసిందనే భావించారు. 2015లో వరల్డ్ కప్‌ తర్వాత షమీని అనేక సమస్యలు చుట్టుముట్టాయి. ఒకవైపు కెరీర్ గాడి తప్పడంతో పాటు కుటుంబ కలహాలు అతడిని మానసికంగా కృంగదీశాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనపై గృహహింస కేసు పెట్టడమే కాక.. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసింది. దీంతో బీసీసీఐ అవినీతి విభాగం షమీపై విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో షమీ కోల్‌కతాలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉండేవాడట. అయితే, అతని మానసిక స్థితిని గమనించిన కుటుంబ సభ్యులు.. ఆత్మహత్య చేసుకుంటాడేమోననే భయంతో అతడిని అస్సలు ఒంటరిగా ఉంచే వాళ్లు కాదట. ఆ కష్టకాలం నుంచి కోలుకోవడానికి అతనికి ఏడాదిన్నర సమయం పట్టగా.. ‘కుటుంబ సభ్యుల అండతోనే తాను తిరిగి క్రికెట్ ఆడటం మొదలు పెట్టానని’ షమీ చెప్పాడు. ఆ తర్వాత ఫిట్‌నెస్ సాధించి తిరిగి భారత జట్టులో స్థానం సంపాదించడంతో పాటు రెగ్యులర్ బౌలర్‌గా మారిపోయాడు.

ప్రస్తుతం షమీ ఫామ్ పీక్ లెవెల్స్‌లో ఉంది. కాగా, కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటున్న షమీ.. టీమ్ ఇండియా వన్డే జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఇన్‌స్టాగ్రామ్ చాట్‌లో పాల్గొన్నాడు. అప్పుడే ఈ విషయాలన్నీ వెల్లడించాడు. కుటుంబమే తనను కాపాడిందన్న షమీ.. గతాన్ని తలచుకొని లైవ్‌లో భావోద్వేగానికి గురయ్యాడు.

Tags: Mohammed Shami, Pace, Bowler, Cricket, BCCI, Rohit Sharma, Team India

Tags:    

Similar News