పెళ్లైన రెండు నెలలకే.. ఉరేసుకుని యువకుడి మృతి

దిశ, చేవెళ్ల : అప్పుల బాధ భరించలేక ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. చేవెళ్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ విజయభాస్కర్ రెడ్డి కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని ఘనపూర్ గ్రామానికి చెందిన బ్యాగారి శ్రీకాంత్ తండ్రి శెంకరయ్య(21) అనే యువకుడు 2నెలలు కిందట కౌకుంట్ల గ్రామానికి చెందిన మనిలాను ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నాడు. దసరా పండుగ సందర్బంగా భార్య వారి అమ్మగారి ఇంటికి వెళ్ళింది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి 8 గంటల […]

Update: 2021-10-16 10:40 GMT

దిశ, చేవెళ్ల : అప్పుల బాధ భరించలేక ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. చేవెళ్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ విజయభాస్కర్ రెడ్డి కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని ఘనపూర్ గ్రామానికి చెందిన బ్యాగారి శ్రీకాంత్ తండ్రి శెంకరయ్య(21) అనే యువకుడు 2నెలలు కిందట కౌకుంట్ల గ్రామానికి చెందిన మనిలాను ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నాడు. దసరా పండుగ సందర్బంగా భార్య వారి అమ్మగారి ఇంటికి వెళ్ళింది.

ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో శ్రీకాంత్ అతని ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వచ్చారు. పరిశీలించన డాక్టర్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. భార్య మనిలాను విచారించగా తన భర్త ఎంతో మంచివాడని, తనకు రూ. 3 లక్షల అప్పు ఉందని అప్పుడప్పుడు చెప్పి బాధపడేవాడని తెలిపింది. అప్పు బాధ భరించలేకే ఉరేసుకుని చనిపోయినట్టు విచారణలో తెలిపింది. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Tags:    

Similar News