ఏపీలో శిల్పారామాల అభివృద్ధికి అనుమతులు..!

దిశ, వెబ్‎డెస్క్: ఏపీలో రెండు శిల్పారామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. శ్రీకాకుళం, తిరుపతిలో శిల్పారామాలు ఏర్పాటు చేసేందుకు రూ.13 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళంలో కొత్త శిల్పారామం ఏర్పాటుకు పర్యాటక, సాంస్కృతిక శాఖ తొలివిడతగా రూ. 3 కోట్లు మంజూరు చేసింది. తిరుపతి శిల్పారామాల అభివృద్ధితో పాటు పలు నిర్మాణాల కోసం రూ. 10 కోట్ల నిధులను కేటాయించింది. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మాణాలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వం […]

Update: 2020-10-03 02:24 GMT

దిశ, వెబ్‎డెస్క్: ఏపీలో రెండు శిల్పారామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. శ్రీకాకుళం, తిరుపతిలో శిల్పారామాలు ఏర్పాటు చేసేందుకు రూ.13 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

శ్రీకాకుళంలో కొత్త శిల్పారామం ఏర్పాటుకు పర్యాటక, సాంస్కృతిక శాఖ తొలివిడతగా రూ. 3 కోట్లు మంజూరు చేసింది. తిరుపతి శిల్పారామాల అభివృద్ధితో పాటు పలు నిర్మాణాల కోసం రూ. 10 కోట్ల నిధులను కేటాయించింది. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మాణాలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వం సూచించింది.

Tags:    

Similar News