గణేష్ మండపాలకు అనుమతి తప్పనిసరి

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. అయితే, దానికి సంబంధించి గణేష్ ఉత్సవ సమితి, మున్సిపల్ అధికారులతో ఇప్పటికే చర్చలు జరిపారు. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు మండపాల ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలో గణేష్ మండపాలు ఏర్పాటు చేసే వారు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పోలీసు కమిషనర్ అంజనీకుమార్ స్పష్టం చేశారు. దీనికోసం నిర్వాహకులు వారి డివిజన్లకు చెందిన అసిస్టెంట్ కమిషనర్ల […]

Update: 2021-09-02 01:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. అయితే, దానికి సంబంధించి గణేష్ ఉత్సవ సమితి, మున్సిపల్ అధికారులతో ఇప్పటికే చర్చలు జరిపారు. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు మండపాల ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలో గణేష్ మండపాలు ఏర్పాటు చేసే వారు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పోలీసు కమిషనర్ అంజనీకుమార్ స్పష్టం చేశారు. దీనికోసం నిర్వాహకులు వారి డివిజన్లకు చెందిన అసిస్టెంట్ కమిషనర్ల ద్వారా అనుమతులు పొందాలని సూచించారు. ఇతర సమాచారం కోసం www.hyderabadpolice.gov.in వెబ్‌సైట్‌లో చూడాలని తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని, కరోనా నిబంధనల మధ్య నవరాత్రులు నిర్వహించే విధంగా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Tags:    

Similar News