ఇంటి నుంచే పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఎర్రబెల్లి
దిశ, వరంగల్: కరోనా నిర్మూలన జరిగే వరకు ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని, సీతారాముల కృప, కటాక్షలు ప్రజలపై ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. కరోనా వైరస్ నేపథ్యంలో వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలోని శ్రీ రామాలయం సీతారామ చంద్రస్వామి వివాహ మహోత్సవానికి మంత్రి తమ ఇంటి నుంచే పట్టు వస్త్రాలు, తలంబ్రాలు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ నిర్మూలన జరిగి, వచ్చే శ్రీరామ నవమికి ప్రజలంతా గుళ్ళు, గోపురాలకు […]
దిశ, వరంగల్: కరోనా నిర్మూలన జరిగే వరకు ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని, సీతారాముల కృప, కటాక్షలు ప్రజలపై ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. కరోనా వైరస్ నేపథ్యంలో వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలోని శ్రీ రామాలయం సీతారామ చంద్రస్వామి వివాహ మహోత్సవానికి మంత్రి తమ ఇంటి నుంచే పట్టు వస్త్రాలు, తలంబ్రాలు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ నిర్మూలన జరిగి, వచ్చే శ్రీరామ నవమికి ప్రజలంతా గుళ్ళు, గోపురాలకు మళ్లీ గుంపులుగా వెళ్లే మంచి రోజులు రావాలని కోరారు. ప్రజలెవరూ రామాలయాలకు వెళ్ళొద్దని, తమ ఇళ్ళల్లోనే పండుగ జరుపుకోవాలని సూచించారు. అనంతరం ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.
Tags : People, practice, self-control, minister errabelli dayakar rao, warangal