రోడ్డుపై చేపలు.. పట్టుకునేందుకు పోటీ పడుతున్న ప్రజలు(Video)
దిశ, జగిత్యాల : పాలకులు పట్టించుకోక పోయినా, ప్రకృతి కరుణించిందని మేడిపల్లి మండలం ఈదుల లింగంపేట గ్రామస్తులు సంబురాలు చేసుకుంటున్నారు. లింగంపేట గ్రామ ప్రజలు ఎన్నో ఏండ్ల నుంచి నీటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే 2015 నుంచి 2018 వరకు మూడు సంవత్సరాలు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ట్యాంకర్లతో ఇంటింటికీ నీళ్లు అందించారు. అలాగే, కొందరు డ్రమ్ముకి 50 రూపాయలు పెట్టి కొన్నారు. ఇంతటి గడ్డు కాలం చూసిన గ్రామస్తులకు, ఇప్పుడు రెండు రోజులుగా కురుస్తున్న […]
దిశ, జగిత్యాల : పాలకులు పట్టించుకోక పోయినా, ప్రకృతి కరుణించిందని మేడిపల్లి మండలం ఈదుల లింగంపేట గ్రామస్తులు సంబురాలు చేసుకుంటున్నారు. లింగంపేట గ్రామ ప్రజలు ఎన్నో ఏండ్ల నుంచి నీటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే 2015 నుంచి 2018 వరకు మూడు సంవత్సరాలు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ట్యాంకర్లతో ఇంటింటికీ నీళ్లు అందించారు.
అలాగే, కొందరు డ్రమ్ముకి 50 రూపాయలు పెట్టి కొన్నారు. ఇంతటి గడ్డు కాలం చూసిన గ్రామస్తులకు, ఇప్పుడు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గ్రామంలోని నల్లవారికుంటా, తుమ్మల చెరువు, కొత్త చెరువు, నిండి మత్తడి దూకుతున్నాయి. ఈ సన్నివేశాలను చూసిన గ్రామస్తుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. సుమారు 13 ఏండ్ల తర్వాత ఇలాంటి వర్షాలు చూస్తున్నామని గ్రామస్తులు తెలిపారు.
తాజాగా కురుస్తున్న వర్షాలతో గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల అవరణంలో గల బోరు నుంచి ఉబికి వస్తున్న నీటిని చూడటానికి గ్రామస్తులు బారులు తీరారు. ఇలాంటి వర్షాలు వస్తే నీటి సమస్య ఉండదని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, మండలంలో సుమారు 44 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైయినట్లు అధికారులు తెలిపారు.
టెన్షన్ టెన్షన్ : వేములవాడ బ్రిడ్జి ఉంటుందా.. మళ్లీ ఊడుతుందా..?
భారీ వర్షాలకు రోడ్డుపై చేపలు..
జిల్లాలో భారీ వర్షాలకు చేపలు రోడ్డుపైకి రావడంతో గ్రామస్తులు, ప్రయాణికులు చేపల కోసం పోటీ పడ్డారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ చెరువు నిండింది. ఈ క్రమంలో చెరువు మత్తడి దూకడంతో, లోలేవల్ వంతెన పై నుంచి వరద నీరు పారుతోంది. ఈ వంతెన వద్ద రోడ్డుపైకి నీళ్లతో పాటు వచ్చిన చేపలను పట్టుకునేందుకు గ్రామస్తులు, ప్రయాణికులు పోటీపడుతున్నారు. కొందరు వలలతో చేపలు పట్టి సంచులలో నింపుకుంటున్నారు.