ఫైర్ ఇంజన్ లేక అవస్థలు.. బూడిది పాలవుతున్న ఇల్లులు

దిశ, బోథ్ : చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం.. అని సామెతలా ఉంది బోథ్ మండల పరిస్థితి. మండలం లో 33 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. 33 గ్రామ పంచాయితీ పరిధిలో లో దాదాపు కొన్ని వేల పూరి గుడిసెలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో వైశ్యాలం పరంగా చిన్నగా ఉండడం వలన నివాసాలు దగ్గర దగ్గరగా ఉంటాయి. ఒక ఇంటికి నిప్పు అంటుకున్నా ఊరు మొత్తం బూడిద పాలు అవుతుంది.. బోథ్ మండలంకు ఫైర్ ఇంజన్ లేదు. […]

Update: 2021-04-30 03:09 GMT

దిశ, బోథ్ : చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం.. అని సామెతలా ఉంది బోథ్ మండల పరిస్థితి. మండలం లో 33 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. 33 గ్రామ పంచాయితీ పరిధిలో లో దాదాపు కొన్ని వేల పూరి గుడిసెలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో వైశ్యాలం పరంగా చిన్నగా ఉండడం వలన నివాసాలు దగ్గర దగ్గరగా ఉంటాయి. ఒక ఇంటికి నిప్పు అంటుకున్నా ఊరు మొత్తం బూడిద పాలు అవుతుంది.. బోథ్ మండలంకు ఫైర్ ఇంజన్ లేదు. ఇచ్చోడ మండలంలో ఫైర్ ఇంజన్ ఉంది. ఇచ్చోడ నుండి బోథ్ కి 20 కిలో మీటర్ల దూరం ఉంది ఫైర్ ఇంజన్ మండల కేంద్రానికి రావాలంటే 30 ని,,పైగా సమయం పడుతుంది. ఫైర్ ఇంజన్ వచ్చేవరకు జరిగిపోయే నష్టం జరిగి పోయి బూడిద మాత్రమే మిగులుతుందని ఆ గ్రామల్లోని ప్రజలు బాధ వ్యక్తం చేస్తున్నారు.

నిరుపేద కుటుంబం ఇళ్లు బుగ్గిపాలు..

శుక్రవారం ఉదయం ఓ నిరుపేద ఇళ్లు కాలిపోవడంతో ఆ కుటుంబం రోడ్డు మీద పడింది. వివరాల్లోకి వెళ్తే… బోథ్ మండల కేంద్రానికి చెందిన దాసరి గంగయ్య వృతి రీత్యా ప్రైవేట్ టీచర్ అంతేకాకుండా కరోనా వలన స్కూల్ నడవక 6 నెలల క్రితం చికెన్ షాప్ పెట్టుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ మధ్య వ్యాపారం సరిగ్గా నడవడం లేదు దీనికి తోడుగా ఇటీవలే తన తమ్ముడికి రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో అతన్ని ఆసుపత్రి కి తీసుకొని వెళ్ళారు. ఇంట్లో ఎవరూ లేకుండా ఉండడంతో షార్ట్ సర్కుట్ వలన ఇల్లు మొత్తం కాలిపోయింది. దీంతో వారు సుమారు ఇళ్లు తో కలిపి 13 లక్షల వరకు అస్తి నష్టం అయిందని అధికారులు పంచనామాలో తెలిపారు.

ఫైర్ ఇంజన్ లేక ఇప్పటివరకు జరిగిన సంఘటనలు..

గత వేసవి కాలం లో ఒక జిన్నింగ్ ఫ్యాక్టరీలో పత్తి కాలి పోయి సుమారు 30 లక్షల వరకు నష్టం వాటిల్లింది. బోథ్ లోని ఎస్సీ కాలనీలో ఇల్లు కాలిపోయి సుమారు 8 లక్షల అస్తి నష్టం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పైపు కాలిపోయి దాదాపు గా 40 లక్షల వరకు నష్టం.
ఇప్పటికైనా మండలం కి ఒక ఫైర్ ఇంజన్ ఏర్పాటు చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరగవని అస్తి నష్టం కూడా తగ్గుతుందని, ఇకనైన బోథ్ మండలం లో ఫైర్ ఇంజన్ ఏర్పాటు చెయ్యాలని ప్రజలు, ప్రజా ప్రతినిదులు అధికారులను వేడుకుంటున్నారు.

Tags:    

Similar News