57 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ ఇవ్వాలి : బీజేవైఎం సతీష్

దిశ, దుగ్గొండి : వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో 57 ఏండ్లు నిండిన, అర్హులైన నిరుపేదలందరికీ ఆసరా పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి, పీఎసీఎస్ డైరెక్టర్ సతీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం గిర్నిబావి సెంటర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్.. 57 సంవత్సరాలు నిండిన వారికి ఆసరా పెన్షన్ అందిస్తామని ప్రకటించి ఎన్నికలు కాగానే ఇచ్చిన హామీని అటకెక్కించారని ఆరోపించారు. గతంలో లాగే 60 ఏండ్లు నిండిన […]

Update: 2021-11-16 08:31 GMT

దిశ, దుగ్గొండి : వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో 57 ఏండ్లు నిండిన, అర్హులైన నిరుపేదలందరికీ ఆసరా పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి, పీఎసీఎస్ డైరెక్టర్ సతీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం గిర్నిబావి సెంటర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్.. 57 సంవత్సరాలు నిండిన వారికి ఆసరా పెన్షన్ అందిస్తామని ప్రకటించి ఎన్నికలు కాగానే ఇచ్చిన హామీని అటకెక్కించారని ఆరోపించారు. గతంలో లాగే 60 ఏండ్లు నిండిన వారికే మంజూరు చేస్తున్నారని, కొత్తవారికి పెన్షన్లు అందించడంలేదని అర్హులు వాపోతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి ఇచ్చిన హామీని నెరవేర్చాలని సతీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

Tags:    

Similar News