కాటారం మార్కెట్ కమిటీ చైర్‌ ప‌ర్సన్‌గా పెండ్యాల మ‌మ‌త..?

దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి గడువు అక్టోబర్ నెలతో ముగిసింది. ఈ నేపథ్యంలో చైర్మన్ పదవి కోసం మహదేవపూర్, కాటారం, మహాముత్తారం మండలాలకు చెందిన పలువురు నాయకులు పోటీ పడ్డారు. కాగా, కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఈ క్రమంలో జెడ్పీటీసీ ఎన్నికల్లో మహదేవ్‌పూర్ నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పెండ్యాల మమత ఎంపిక దాదాపుగా ఖ‌రారైన‌ట్లుగా టీఆర్ఎస్ ముఖ్య […]

Update: 2021-12-12 07:53 GMT
Pendyala Mamatha
  • whatsapp icon

దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి గడువు అక్టోబర్ నెలతో ముగిసింది. ఈ నేపథ్యంలో చైర్మన్ పదవి కోసం మహదేవపూర్, కాటారం, మహాముత్తారం మండలాలకు చెందిన పలువురు నాయకులు పోటీ పడ్డారు. కాగా, కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఈ క్రమంలో జెడ్పీటీసీ ఎన్నికల్లో మహదేవ్‌పూర్ నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పెండ్యాల మమత ఎంపిక దాదాపుగా ఖ‌రారైన‌ట్లుగా టీఆర్ఎస్ ముఖ్య నేత‌ల ద్వారా తెలుస్తోంది. కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపిక పూర్తవడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News