ఐదేళ్ల ‘పెళ్లి చూపులు’.. ఇప్పటికీ అదే ఫీలింగ్!
దిశ, సినిమా : కమర్షియల్, మాస్, హీరో సెంట్రిక్ వంటి మూస ఫార్ములాకు అలవాటుపడ్డ టాలీవుడ్‌కు కొత్త దారిని చూపిన సినిమా ‘పెళ్లి చూపులు’. చిన్న సినిమాలు, డెబ్యూ హీరోలకు ప్రేక్షకాదరణ లభించదనే అపవాదును తుడిచేసిన చిత్రమూ ఇదే. యూనిక్ కంటెంట్‌కు తోడు చుట్టుపక్కల ఫ్రెండ్స్, ఫ్యామిలీ మధ్య చోటుచేసుకునే అంశాలనే నేచురల్‌గా ప్రజెంట్ చేసి ఆడియన్స్‌కు ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చారు మేకర్స్. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ రాసుకున్న కథకు హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రితూ […]
దిశ, సినిమా : కమర్షియల్, మాస్, హీరో సెంట్రిక్ వంటి మూస ఫార్ములాకు అలవాటుపడ్డ టాలీవుడ్‌కు కొత్త దారిని చూపిన సినిమా ‘పెళ్లి చూపులు’. చిన్న సినిమాలు, డెబ్యూ హీరోలకు ప్రేక్షకాదరణ లభించదనే అపవాదును తుడిచేసిన చిత్రమూ ఇదే. యూనిక్ కంటెంట్‌కు తోడు చుట్టుపక్కల ఫ్రెండ్స్, ఫ్యామిలీ మధ్య చోటుచేసుకునే అంశాలనే నేచురల్‌గా ప్రజెంట్ చేసి ఆడియన్స్‌కు ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చారు మేకర్స్.
డైరెక్టర్ తరుణ్ భాస్కర్ రాసుకున్న కథకు హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రితూ వర్మతో పాటు సపోర్టింగ్ యాక్టర్స్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్‌తో న్యాయం చేశారు. కమెడియన్ ప్రియదర్శి కామెడీ థియేటర్లలో నవ్వులు పూయించింది. నేపథ్య సంగీతం, పాటలు ఒక్కటేమిటి.. ప్రతీ అంశం సక్సెస్‌లో భాగం పంచుకుంది. కాగా 2016 జూలై 29న రిలీజైన ‘పెళ్లి చూపులు’ నేటితో ఐదేళ్లు పూర్తిచేసుకుంది.
రాజ్ కందుకూరి, యశ్ రంగినేని నిర్మించిన సినిమా ‘నేషనల్ అవార్డు’ పొందిన విషయం తెలిసిందే. అయితే సూపర్ హిట్ సినిమాలు కూడా కొంతకాలం తర్వాత మరుగునపడిపోతాయి. కానీ ‘పెళ్లి చూపులు’ చిత్రాన్ని ఇప్పుడు చూసినా అదే ఫీలింగ్ ఇస్తుందనడంలో సందేహం లేదు. ఐదేళ్లయిన సందర్భంగా మరోసారి ఆ మ్యాజిక్ చూడాలంటే జియో సినిమాలో అందుబాటులో ఉన్న సినిమాను మళ్లీ చూసేయండి.