ఇక డిజిటల్ వ్యాపారమే

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రముఖ సంస్థలన్నీ డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్ వైపు అడుగులేస్తున్నాయి. ఇకనుంచి వ్యాపారాలన్నీ డిజిటల్‌లోనే నడుస్తాయని స్పష్టమవుతోంది. సాధికారతను సాధించడానికి సాఫ్ట్‌వేర్ వినియోగం అనివార్యంగా మారిందని పెగా సిస్టమ్స్ ఇన్ కార్పొరేషన్ సంస్థ సర్వేలో వెల్లడైంది. కొవిడ్-19ను ఎదుర్కోవడానికి వ్యాపార కార్యకలాపాలు, వ్యవస్థల్లో ఊహించిన దాని కంటే ఎక్కువగా లోపాలను గుర్తించినట్లు 74శాతం మంది వ్యాపారవేత్తలు తెలిపారు. సంక్షోభంలలో వినియోగదార్లకు సాయం అందించేందుకు వారి దగ్గరున్న డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ […]

Update: 2020-06-18 06:08 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రముఖ సంస్థలన్నీ డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్ వైపు అడుగులేస్తున్నాయి. ఇకనుంచి వ్యాపారాలన్నీ డిజిటల్‌లోనే నడుస్తాయని స్పష్టమవుతోంది. సాధికారతను సాధించడానికి సాఫ్ట్‌వేర్ వినియోగం అనివార్యంగా మారిందని పెగా సిస్టమ్స్ ఇన్ కార్పొరేషన్ సంస్థ సర్వేలో వెల్లడైంది. కొవిడ్-19ను ఎదుర్కోవడానికి వ్యాపార కార్యకలాపాలు, వ్యవస్థల్లో ఊహించిన దాని కంటే ఎక్కువగా లోపాలను గుర్తించినట్లు 74శాతం మంది వ్యాపారవేత్తలు తెలిపారు. సంక్షోభంలలో వినియోగదార్లకు సాయం అందించేందుకు వారి దగ్గరున్న డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ సరిపోలేదని 54శాతం మంది అంగీకరించారు. లాక్‌డౌన్‌లో తమ కమ్యూనికేషన్ల లోపం కారణంగా చాలామంది వినియోగదారులను కోల్పోయినట్లు 36శాతం ఒప్పుకున్నారు. లాక్‌డౌన్‌లో వినియోగదారుల మనోభావాలను బాగా అర్ధం చేసుకున్నట్లు 69శాతం వెల్లడించారు. అంతకుముందు కంటే ఇప్పుడే కస్టమర్ల గురించి ఎక్కువగా తెలుసుకున్నట్లు 61శాతం మంది వ్యాపారులు చెప్పారు. డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ ప్రాధాన్యత పెరిగిందని 62శాతం మంది చెప్పారు.

Tags:    

Similar News