పీడీఎస్‌యూ, పీవైఎల్ సంఘాల ఆందోళన

నిరుద్యోగ సమస్య నిర్మూలన, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. నిజామాబాద్ జిల్లా ఎంప్లాయి‎మెంట్ ఆఫీస్ ఎదుట పీడీఎస్‌యూ, పీవైఎల్ సంఘాలు ఆందోళన చేపట్టాయి. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నా.. ప్రభుత్వం నియామకాలు చేపట్టడం లేదని ఇరు సంఘాల నేతలు ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం ప్రధానంగా ఉద్యోగాలు, విద్యారంగాన్ని బాగుచేయడం కోసమే జరిగిందని నాయకులు గుర్తుచేశారు. కానీ, రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని వారు […]

Update: 2020-02-19 06:58 GMT

నిరుద్యోగ సమస్య నిర్మూలన, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. నిజామాబాద్ జిల్లా ఎంప్లాయి‎మెంట్ ఆఫీస్ ఎదుట పీడీఎస్‌యూ, పీవైఎల్ సంఘాలు ఆందోళన చేపట్టాయి. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నా.. ప్రభుత్వం నియామకాలు చేపట్టడం లేదని ఇరు సంఘాల నేతలు ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం ప్రధానంగా ఉద్యోగాలు, విద్యారంగాన్ని బాగుచేయడం కోసమే జరిగిందని నాయకులు గుర్తుచేశారు. కానీ, రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని వారు ఆరోపించారు.

Tags:    

Similar News