సల్మాన్ ఇది నీ పనేనా?: పాయల్

బాలీవుడ్ నటి పాయల్ రోహత్గి.. సుశాంత్ సింగ్ రాజ్‌పు‌త్ మరణంపై ట్విట్టర్ వేదికగా సెలబ్రిటీలను ప్రశ్నించింది. పలువురు సినీప్రముఖులు చేసిన పనికి సుశాంత్ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని తన అభిప్రాయాన్ని గట్టిగా వినిపించింది. సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్, మహేశ్ భట్ లాంటి వారిని నెపోటిజం గురించి గట్టిగానే ప్రశ్నించింది. దీంతో ట్విట్టర్ అడ్మినిస్ట్రేషన్.. పాయల్ ట్విట్టర్ ఎకౌంట్‌ను సస్పెండ్ చేసింది. View this post on Instagram Why my Twitter Account is SUSPENDED […]

Update: 2020-07-08 05:38 GMT
సల్మాన్ ఇది నీ పనేనా?: పాయల్
  • whatsapp icon

బాలీవుడ్ నటి పాయల్ రోహత్గి.. సుశాంత్ సింగ్ రాజ్‌పు‌త్ మరణంపై ట్విట్టర్ వేదికగా సెలబ్రిటీలను ప్రశ్నించింది. పలువురు సినీప్రముఖులు చేసిన పనికి సుశాంత్ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని తన అభిప్రాయాన్ని గట్టిగా వినిపించింది. సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్, మహేశ్ భట్ లాంటి వారిని నెపోటిజం గురించి గట్టిగానే ప్రశ్నించింది. దీంతో ట్విట్టర్ అడ్మినిస్ట్రేషన్.. పాయల్ ట్విట్టర్ ఎకౌంట్‌ను సస్పెండ్ చేసింది.

అయితే తాను ఎవరినీ బెదిరించలేదని, ఎవరినీ విమర్శించలేదని.. కేవలం ఉన్న నిజాలు నిర్భయంగా మాట్లాడానని చెప్పింది. నిజాలు మాట్లాడితే అకౌంట్ సస్పెండ్ చేస్తారా? అంటూ ప్రశ్నించింది. ఇన్‌స్టా వేదికగా ఈ విషయాన్ని సుశాంత్ ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్న పాయల్.. తన అకౌంట్ తిరిగి వచ్చేందుకు హెల్ప్ చేయాలని కోరింది.

అంతేకాదు సల్మాన్ ఖాన్‌కు సంబంధించిన కొందరు వ్యక్తులు తనపై ఫిర్యాదు చేశారని తెలిసిందని.. తెలిసిన నిజాలు మాట్లాడితే ఇలా చేస్తారా? అంటూ ప్రధాని నరేంద్ర మోడీకి సోషల్ మీడియా వేదిక ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపింది. భారతదేశంలో మాట్లాడే హక్కు లేదా? అభిప్రాయాలను వెల్లడిస్తే తప్పా? అని అడిగింది. ఇలాంటి ట్విట్టర్‌లు బ్యాన్ చేసి, దేశీ యాప్స్‌ను ప్రోత్సహించాలని కోరింది పాయల్.

Tags:    

Similar News