పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో పవన్ సినిమాలు.. ఎన్నంటే?

దిశ, సినిమా: ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో పవర్ స్టార్..‘పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ పేరుతో హోమ్ ప్రొడక్షన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన యంగ్ టాలెంటెడ్ పీపుల్‌కు అవకాశాలిచ్చేందుకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌తో కలిసి సంయుక్తంగా చిత్రాలను నిర్మించనున్నారు. మొత్తం 15 సినిమాలు తమ కాంబినేషన్‌లో రాబోతున్నాయని వారు ప్రకటించారు. మూడు హై బడ్జెట్ మూవీస్, ఆరు నార్మల్ బడ్జెట్‌తో తెరకెక్కించబోతుండగా, మరో ఆరు చిన్న సినిమాలు చేయనున్నట్లు తెలిపారు. […]

Update: 2021-04-02 01:25 GMT

దిశ, సినిమా: ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో పవర్ స్టార్..‘పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ పేరుతో హోమ్ ప్రొడక్షన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన యంగ్ టాలెంటెడ్ పీపుల్‌కు అవకాశాలిచ్చేందుకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌తో కలిసి సంయుక్తంగా చిత్రాలను నిర్మించనున్నారు. మొత్తం 15 సినిమాలు తమ కాంబినేషన్‌లో రాబోతున్నాయని వారు ప్రకటించారు. మూడు హై బడ్జెట్ మూవీస్, ఆరు నార్మల్ బడ్జెట్‌తో తెరకెక్కించబోతుండగా, మరో ఆరు చిన్న సినిమాలు చేయనున్నట్లు తెలిపారు. కథా రచయితలు, దర్శకుల ప్రతిభకు అనువైన వాతావరణం కల్పించేలా తమ భాగస్వామ్యం ఉంటుందన్నారు నిర్మాత టి.జి.విశ్వప్రసాద్, పవన్. హరీష్ పాయ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా కీలక బాధ్యతలు తీసుకుంటారని, సంస్థ ప్రతినిధులు ఎప్పటికప్పుడు ఇందుకు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తారని వెల్లడించారు.

Tags:    

Similar News

Sharvari

Ishita Raj Sharma