PSPK27 షూటింగ్ షురూ..

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ పింక్ రీమేక్ ‘వకీల్ సాబ్‘ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని, విడుదలకు సిద్ధంగా ఉంది. అంతేగాకుండా ఈ చిత్రానికి సంబంధించి ఈ సంక్రాంతి సందర్భంగా టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే వకీల్ సాబ్ అనంతరం పవన్ కళ్యాణ్ ఓకే చెప్పిన డైరెక్టర్ క్రిష్ సినిమా పట్టాలెక్కినట్టు తెలుస్తోంది. ఇటీవల కరోనా భారీన […]

Update: 2021-01-11 22:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ పింక్ రీమేక్ ‘వకీల్ సాబ్‘ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని, విడుదలకు సిద్ధంగా ఉంది. అంతేగాకుండా ఈ చిత్రానికి సంబంధించి ఈ సంక్రాంతి సందర్భంగా టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే వకీల్ సాబ్ అనంతరం పవన్ కళ్యాణ్ ఓకే చెప్పిన డైరెక్టర్ క్రిష్ సినిమా పట్టాలెక్కినట్టు తెలుస్తోంది. ఇటీవల కరోనా భారీన పడిన డైరెక్టర్ క్రిష్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. దీంతో పవన్ కళ్యాణ్‏తో కలిసి సోమవారం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభించాడు. దాదాపు నెల రోజులలో ఈ మూవీని పూర్తి చేసేలా క్రిష్ ప్లాన్ చేసుకున్నాడు. పవన్‏తో తీయబోయే సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లో ప్లాన్ చేశాడు. ఎలాగైనా హిట్ సాధించాలని కసిగా ఉన్నాడు దర్శకుడు క్రిష్. చారిత్రాత్మక నేపథ్యంలో ఈ సినిమాను క్రిష్ తెరకెక్కిస్తుండగా.. ఇందులో వపన్ సరికొత్త లుక్‏లో కనిపించనున్నట్లు సమాచారం. ఇక పవన్ కూడా ఈ సినిమా షూటింగ్‏లో పాల్గొనేందుకు రెడీగా ఉన్నాడు. ఇందుకోసం 25 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చాడని తెలుస్తోంది.

Tags:    

Similar News

Sharvari

Ishita Raj Sharma