ఇట్స్ టైం ఫర్ ‘పట్టణ ప్రగతి’
దిశ,వెబ్‌డెస్క్ నేటి నుంచి తెలంగాణలో పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం కానుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమం నేటి నుంచి మార్చి4వరకు కొనసాగనుంది. పట్టణాల్లో టాయిలెట్లు,విద్యుత్,రోడ్లు మౌలిక సదుపాయాల కల్పన వంటి ముఖ్యమైన అంశాలతో రాష్ట్ర ప్రభుత్వం దీనికి శ్రీకారం చుట్టింది. పట్టణ ప్రగతిని సీఎం కేసీఆర్ సీరియస్‌గా తీసుకున్నారు. పనుల నిర్వహణలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజాప్రతినిధులు,అధికారులు కూడా తమ పదవిని వదులుకోవాల్సిందేనని సీఎం హెచ్చరించిన సంగతి అందరికి తెలిసిందే.కాగా, ఈ కార్యక్రమాన్నిసమర్థవంతంగా […]
దిశ,వెబ్‌డెస్క్
నేటి నుంచి తెలంగాణలో పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం కానుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమం నేటి నుంచి మార్చి4వరకు కొనసాగనుంది. పట్టణాల్లో టాయిలెట్లు,విద్యుత్,రోడ్లు మౌలిక సదుపాయాల కల్పన వంటి ముఖ్యమైన అంశాలతో రాష్ట్ర ప్రభుత్వం దీనికి శ్రీకారం చుట్టింది. పట్టణ ప్రగతిని సీఎం కేసీఆర్ సీరియస్‌గా తీసుకున్నారు. పనుల నిర్వహణలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజాప్రతినిధులు,అధికారులు కూడా తమ పదవిని వదులుకోవాల్సిందేనని సీఎం హెచ్చరించిన సంగతి అందరికి తెలిసిందే.కాగా, ఈ కార్యక్రమాన్నిసమర్థవంతంగా అమలు చేయడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంతమేర సక్సెస్ అవుతారో వేచిచూడాల్సిందే.
read also..