పట్టణ ప్రగతి..పట్టెరా ఏం‘గతి’
పట్టణ ప్రగతి సమావేశంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో కొత్త మున్సిపల్ చట్టంపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పట్టణ ప్రగతిలో అనుకున్న ఫలితాలు రాకపోతే మంత్రుల నుంచి అధికారుల వరకు ఏం‘గతి’ పడుతుందో గులాబీబాస్ చెప్పకనే చెప్పినట్టు తెలుస్తోంది. సమావేశం ఆద్యంతం వాడివేడీగా నడిచినట్టు సమాచారం.ముందుగా పట్టణ ప్రగతిలో ప్రభుత్వం అవలంభించనున్న విధానాలను సీఎం అందరికి వివరించారు. ఫలితాలు రావాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు ఏంచేయాలో కూడా దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని అన్నిపట్టణాలు, నగరాలను సుందరంగా […]
పట్టణ ప్రగతి సమావేశంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో కొత్త మున్సిపల్ చట్టంపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పట్టణ ప్రగతిలో అనుకున్న ఫలితాలు రాకపోతే మంత్రుల నుంచి అధికారుల వరకు ఏం‘గతి’ పడుతుందో గులాబీబాస్ చెప్పకనే చెప్పినట్టు తెలుస్తోంది. సమావేశం ఆద్యంతం వాడివేడీగా నడిచినట్టు సమాచారం.ముందుగా పట్టణ ప్రగతిలో ప్రభుత్వం అవలంభించనున్న విధానాలను సీఎం అందరికి వివరించారు. ఫలితాలు రావాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు ఏంచేయాలో కూడా దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని అన్నిపట్టణాలు, నగరాలను సుందరంగా తీర్చిదిద్ది, దేశంలోనే ఆదర్శ పట్టణాలుగా మార్చాలన్నారు.డెవలప్ మెంట్‌లో పారదర్శక విధానాలను పాటించి,ప్రజలను కూడా సమీకృతం చేస్తే గొప్ప ఫలితాలు సాధించవచ్చునని చెప్పారు. పట్టణ ప్రగతి ఆశామాషీగా ఉండొద్దని, ప్రణాళిక బద్దంగా జరగాలన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులకు,అధికారులకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మూడు నెలల వ్యవధిలో పట్టణాలు, నగరాల్లో పబ్లిగ్ టాయ్‌లెట్లు పూర్తి చేయాలన్నారు.
అలాగే 8 ఎనిమిది నెలల్లో కరెంటుకు సంబంధించిన సమస్యలన్నింటిని పరిష్కరించాలన్నారు.లేనియెడల ఎమ్మెల్యేలు, మేయర్లు,చైర్ పర్సన్లు,కమిషనర్లు తమ పదవుల నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని సీఎం హెచ్చరించారు. స్ట్రీట్ వెండర్స్ కోసం అన్నిపట్టణాల్లో ప్రత్యేక వెల్డింగ్ జోన్స్,ఆటోలు, ట్యాక్సీలు, సరుకు రవాణా వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాని తెలిపారు. కొత్త మున్సిపల్ చట్టంపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలని, అక్రమ నిర్మాణాలపైన అధికారులు కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజాప్రతినిధులు దళిత వాడల్లో పాదయాత్రలు నిర్వహించి అక్కడే ప్రారంభించాలని సూచించారు. సమావేశం ముగిసాక అధికారులందరూ సిద్దిపేట, గజ్వేల్‌కు వెళ్లి అక్కడి మోడల్ మార్కెట్లను సందర్శించాలన్నారు.నగరంలో తీసుకోబోయే డెవలప్ మెంట్ చర్యలపై విధివిధానాలు ఖరారు చేయాలని సీఎం అల్టిమేటం జారీచేశారు.కాగా, మీటింగ్ అనంతరం పట్టణ ప్రగతి మనకు ఏం‘గతి’ పట్టిస్తుందోనని అధికారులు, ప్రజాప్రతినిధులు అనుకుంటున్నట్టు ఊహగానాలు వినిపిస్తున్నాయి.