రంగారెడ్డి స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు..
దిశ ప్రతినిధి, రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో రెండు స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటికి సంబంధించి ఈ నెల 15వ తేదీన నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 15 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు ఇంకా ఒక రోజు గడువు ఉండటంతో సోమవారం అధికార పార్టీ టీఆర్ఎస్‌కు చెందిన ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం స్థానిక సంస్థల కోటాలో ఎంపికైన ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, […]
దిశ ప్రతినిధి, రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో రెండు స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటికి సంబంధించి ఈ నెల 15వ తేదీన నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 15 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు ఇంకా ఒక రోజు గడువు ఉండటంతో సోమవారం అధికార పార్టీ టీఆర్ఎస్‌కు చెందిన ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం స్థానిక సంస్థల కోటాలో ఎంపికైన ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజులు తిరిగి లక్డికపూల్‌లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో నామినేషన్లు దాఖలు చేశారు. పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, శంభీపూర్ రాజుకి మంత్రి మల్లారెడ్డిలు పార్టీ బీఫామ్‌లు అందజేశారు.
అనంతరం పట్నం మహేందర్ రెడ్డిని మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, మెతుకు ఆనంద్, ప్రకాశ్‌గౌడ్‌లు బలపర్చగా, శంభీపూర్ రాజుకు మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, వివేకానంద గౌడ్‌లు బలపర్చి నామినేషన్‌లు వేశారు. నేటితో నామినేషన్ల గడువు ముగియడంతో ఇప్పటికీ నామినేషన్లు మూడు దాఖలు కాగా, ఇందులో రెండు సెట్లు పట్నం మహేందర్ రెడ్డి, ఒక సెట్ రాజుల నామినేషన్లుగా దాఖలైనట్లు కలెక్టర్ ఆమోయ్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం అధికార పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్లు దాఖలైతే పోటీ ఉంటుంది. నామినేషన్లు వేయకపోతే అధికార పార్టీకి చెందిన అభ్యర్ధులే ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది.