ఆగని వర్షం.. నీట మునిగిన ఆస్పత్రి ప్రాంగణం
దిశ, కుబీర్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో రోగులు, ఆస్పత్రి సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావాలన్నా.. లోపలికి వెళ్లాలన్నా నానా అవస్థలు పడాల్సి వచ్చింది. మోకాళ్ళ లోతు నీళ్లు చేరడంతో ఆస్పత్రి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆస్పత్రిలో వైద్య సేవల కొరకు వచ్చిన రోగులు నీళ్లను చూసి భయాందోళనకు గురయ్యారు. […]
దిశ, కుబీర్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో రోగులు, ఆస్పత్రి సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావాలన్నా.. లోపలికి వెళ్లాలన్నా నానా అవస్థలు పడాల్సి వచ్చింది. మోకాళ్ళ లోతు నీళ్లు చేరడంతో ఆస్పత్రి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆస్పత్రిలో వైద్య సేవల కొరకు వచ్చిన రోగులు నీళ్లను చూసి భయాందోళనకు గురయ్యారు.
ఆస్పత్రికి సమీపంలో ఉన్న మైసమ్మ చెరువు నుంచి నీరు అధికంగా ప్రవహించడంతో పరిసరాలన్నీ జలమయమయ్యాయి. ఇప్పటికే పలుమార్లు ఆస్పత్రి పరిసరాల్లోకి నీరు చేరడంతో సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. నీరు అక్కడ నిలుస్తుండటంతో దోమలు వృద్ధి చెంది.. డెంగ్యూ వ్యాధి, ఇతర వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం లేకపోలేదు. సంబంధితశాఖ అధికారులు వెంటనే స్పందించి పరిసరాల్లోకి వర్షపు నీరు చేరకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు.