కరోనా నుంచి కోలుకుంటున్న పేషెంట్లు
… 23.4%కి చేరుకున్న రికవరీలు …. ఒక్కరోజే 664 మంది డిశ్చార్జి దిశ, న్యూస్‌బ్యూరో: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నా డిశ్చార్జిలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో రికవరీల శాతం సగటున 23.4% ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్య విశ్లేషణలో తేలింది. దాదాపు 3నెలల వ్యవధిలో దేశంలో సుమారు 30వేల మంది కరోనా బారిన పడితే నాల్గో వంతు మంది (7,027) డిశ్చార్జి అయ్యారు. ఈనెల 26న గరిష్ఠ స్థాయిలో 704 మంది […]
… 23.4%కి చేరుకున్న రికవరీలు
…. ఒక్కరోజే 664 మంది డిశ్చార్జి
దిశ, న్యూస్‌బ్యూరో: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నా డిశ్చార్జిలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో రికవరీల శాతం సగటున 23.4% ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్య విశ్లేషణలో తేలింది. దాదాపు 3నెలల వ్యవధిలో దేశంలో సుమారు 30వేల మంది కరోనా బారిన పడితే నాల్గో వంతు మంది (7,027) డిశ్చార్జి అయ్యారు. ఈనెల 26న గరిష్ఠ స్థాయిలో 704 మంది డిశ్చార్జికాగా మంగళవారం 665 మంది ఇళ్ళకు చేరుకున్నారు. గడచిన 24గంటల్లో దేశంలో 1,594 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 29,974కు చేరుకుంది. ఇందులో 937 మంది (3.4%) చనిపోయారు. మంగళవారం 51మంది చనిపోయారు. ఈ నెల 19 నుంచి ప్రతీరోజు సగటున 1200 మంది కంటే ఎక్కువే కరోనా బారిన పడుతుండగా గత వారం రోజులుగా ఇది 1500 సగటుకు చేరుకుంది. కేసుల సంఖ్య రెట్టింపు అయ్యే పరిధి 10రోజులకు పెరిగింది.
కొత్తగా నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ భాగం మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోనే ఉన్నాయి. మొత్తం తొమ్మిది రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు వెయ్యి మార్కు దాటగా ఐదు నగరాల్లో వెయ్యికంటే ఎక్కువ కేసులు ఉన్నాయి. 1500 కంటే ఎక్కువ పాజిటివ్ కేసులున్న రాష్ట్రాల్లో మాత్రం ఇంకా కొత్త కేసులు గణనీయంగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో వెయ్యికంటే ఎక్కువ కేసులు ఉంటే పది రాష్ట్రాల్లో వెయ్యి కంటే తక్కువ కేసులే ఉన్నాయి. నాలుగు రాష్ట్రాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు. ఐదు రాష్ట్రాల్లో మాత్రం పదికంటే తక్కువ యాక్టివ్ కేసులే ఉన్నాయి. ఏడు రాష్ట్రాల్లో 100 కంటే తక్కువ కేసులే ఉన్నాయి. రికవరీల్లో అన్నింటికంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఫలితాలు సానుకూలంగా ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.
తెలంగాణలో మొత్తం 1009 కేసులు నమోదైనా ఇప్పటివరకు 374మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 610 మంది యాక్టివ్ పేషెంట్లు ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కొత్తగా 82 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం సంఖ్య 1259కు చేరుకుంది. తమిళనాడులో సైతం కొత్తగా 121 కేసులు నమోదుకాగా ఇందులో 103 చెన్నయ్ నగరంలోనే ఉన్నాయి. నగరంలోని మైలాపూర్‌లో ఒకే వీధిలో 11 మంది పాజిటివ్ కేసులు వచ్చాయి. మహారాష్ట్ర, ముంబయి నగరాల్లో మాత్రం పాజిటివ్ కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. వచ్చే నెల 3వ తేదీనాటికి లాక్‌డౌన్‌పై కేంద్రం నిర్ణయం తీసుకోవాలనుకుంటున్న తరుణంలో ఢిల్లీలోని నీతి ఆయోగ్ కేంద్ర కార్యాలయంలో ఒక డైరెక్టర్ స్థాయి అధికారికి పాజిటివ్ కేసు రావడంతో అతనితో కాంటాక్టులో ఉన్నవారందరినీ క్వారంటైన్‌కు తరలించిన ఉన్నతాధికారులు రెండు రోజుల పాటు కార్యాలయాన్ని సీల్ చేశారు.
భారత్ :
మొత్తం కేసులు : 29,974
మృతులు : 937
రికవరీ : 7,027
తెలంగాణ :
మొత్తం కేసులు : 1009
మృతులు : 25
రికవరీ : 374
ఆంద్రప్రదేశ్ :
మొత్తం కేసులు : 1259
మృతులు : 31
రికవరీ : 258
Tags: India, Corona, Positive Cases, Recoveries, Niti Aayog