వాళ్లు స్వేచ్ఛగానే ఉన్నారు.. వీళ్లు బెంబేలెత్తిపోతున్నారు

ఎలుకకి ప్రాణసంకటం పిల్లికి చెలగాటంలా ఉంది అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో పరిస్థితి. ప్రపంచాన్ని కరోనా గడగడలాడిస్తోంది. తన ముందు తోకజాడించిన వారిని మంచానపట్టించి ఉసురు తీసేస్తోంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ భయాందోళనలతో ముక్కు, మూతికి గుడ్డకట్టుకుని చేతులు శుభ్రం చేసుకుని కూర్చుంటున్నాయి. ఊరందరిదీ ఒక దారి ఉలిపిరికట్టెది మరోక దారి అన్నట్టు ప్రపంచం మొత్తం కరోనా పట్ల భయభక్తులతో ఉంటే.. అనంతపురం జిల్లాలోని సర్వజనాస్పత్రిలో కరోనా లక్షణాలతో ఐసోలేషన్, క్వారంటైన్‌ వార్డుల్లో చేరిన రోగులు మాత్రం దర్జాగా తిరుగుతున్నారు. […]

Update: 2020-04-07 23:29 GMT

ఎలుకకి ప్రాణసంకటం పిల్లికి చెలగాటంలా ఉంది అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో పరిస్థితి. ప్రపంచాన్ని కరోనా గడగడలాడిస్తోంది. తన ముందు తోకజాడించిన వారిని మంచానపట్టించి ఉసురు తీసేస్తోంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ భయాందోళనలతో ముక్కు, మూతికి గుడ్డకట్టుకుని చేతులు శుభ్రం చేసుకుని కూర్చుంటున్నాయి.

ఊరందరిదీ ఒక దారి ఉలిపిరికట్టెది మరోక దారి అన్నట్టు ప్రపంచం మొత్తం కరోనా పట్ల భయభక్తులతో ఉంటే.. అనంతపురం జిల్లాలోని సర్వజనాస్పత్రిలో కరోనా లక్షణాలతో ఐసోలేషన్, క్వారంటైన్‌ వార్డుల్లో చేరిన రోగులు మాత్రం దర్జాగా తిరుగుతున్నారు. కరోనా లక్షణాలున్నాయి కుదురుగా ఉండండి అంటే.. కరోనా రాలేదు కదా? అంటూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఆసుపత్రి సిబ్బంది ఎంత మొత్తుకుంటున్నా వారు వినడం లేదు.

దీంతో ఆస్పత్రిలోని సిబ్బంది భయాందోళనలకు గురవుతున్నారు. అరకొర సౌకర్యాలతో సేవలందిస్తున్నా.. వారికి కృతజ్ఞత ఉండడం లేదని వారు వాపోతున్నారు. ప్రధానంగా హిందూపురం ప్రాంతానికి చెందిన వారే ఆస్పత్రిలో సిబ్బంది హెచ్చరికలు పట్టించుకోవడం లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాధికారులను కోరుతున్నారు.

Tags: andhrapradesh, anantapur district, ap, corona, government general hospital, hindupur, quarantine, isolation

Tags:    

Similar News