బ్రెయిన్ సర్జరీ చేస్తుండగా బిగ్ బాస్..

దిశ, వెబ్‌డెస్క్ : బ్రెయిన్ సర్జరీ చేసేటపుడు మనిషి నిద్రపోకూడదు. అలా నిద్రపోకుండా ఉండటానికి ఏవైనా పనులు చేయాలని డాక్టర్లు సూచిస్తారు. ఇటీవల గుంటూరు జిల్లాలోని ‘బృందా న్యూరో సెంటర్‌’లో 33 ఏళ్ల వరప్రసాద్‌కు బ్రెయిన్ సర్జరీ జరిగింది. ఆ సర్జరీ జరుగుతున్నపుడు అతను మెలకువగా ఉండటానికి ల్యాప్‌టాప్‌లో బిగ్‌ బాస్ కార్యక్రమంతో పాటు అవతార్ సినిమాను చూపించినట్లు తెలుస్తోంది. నాలుగున్నర గంటలపాటు సర్జరీ చేసిన తర్వాత వరప్రసాద్ పరిస్థితి మెరుగుపడినట్లు డాక్టర్లు తెలిపారు. గవర్నమెంట్ జనరల్ […]

Update: 2020-11-22 08:31 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బ్రెయిన్ సర్జరీ చేసేటపుడు మనిషి నిద్రపోకూడదు. అలా నిద్రపోకుండా ఉండటానికి ఏవైనా పనులు చేయాలని డాక్టర్లు సూచిస్తారు. ఇటీవల గుంటూరు జిల్లాలోని ‘బృందా న్యూరో సెంటర్‌’లో 33 ఏళ్ల వరప్రసాద్‌కు బ్రెయిన్ సర్జరీ జరిగింది. ఆ సర్జరీ జరుగుతున్నపుడు అతను మెలకువగా ఉండటానికి ల్యాప్‌టాప్‌లో బిగ్‌ బాస్ కార్యక్రమంతో పాటు అవతార్ సినిమాను చూపించినట్లు తెలుస్తోంది. నాలుగున్నర గంటలపాటు సర్జరీ చేసిన తర్వాత వరప్రసాద్ పరిస్థితి మెరుగుపడినట్లు డాక్టర్లు తెలిపారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఆఫ్ గుంటూరుకు చెందిన డాక్టర్ బీహెచ్ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ శేషాద్రి శేఖర్, డాక్టర్ త్రినాథ్‌లు ఈ సర్జరీ చేశారు. ఇలా సర్జరీ చేయడాన్ని అవేక్ బ్రెయిన్ సర్జరీ లేదా అవేక్ క్రేనియోటమీ అంటారు.

మానవ శరీరంలో మెదడు చాలా సంక్లిష్ట అవయవం. దీనికి ఆపరేషన్ చేసేటపుడు ఏదైతే తీసేయాలనుకున్నామో అదే తీసేయాలి. ఆ క్రమంలో పక్కన ఉన్న వాటిని ఏ మాత్రం తగిలినా చాలా ప్రమాదాలు జరుగుతాయి. ముఖ్యంగా ఎలొక్వెంట్ కార్టెక్స్‌కు దరిదాపుల్లో ఆపరేషన్ చేసేటపుడు ఇలా అవేక్ సర్జరీ చేస్తారు. చూపు, మాట, స్పర్శ, కదలికలను ఈ భాగం నియంత్రిస్తుంటుంది. సర్జరీ జరుగుతుండగా కొన్ని పదాలను పలకాలని, ఏదైనా బొమ్మను గుర్తించాలని లేదా మరేదైనా టాస్క్ ఇవ్వడం ద్వారా డాక్టర్లు, పేషెంట్ మెదడు పరిస్థితిని అంచనా వేస్తారు. ఇలా అవేక్ సర్జరీ చేసేటపుడు పేషెంట్‌కు ఎలాంటి నొప్పి తెలియకుండా మెదడు భాగానికి మాత్రమే అనస్థీషియా ఇస్తారు. అంటే మెదడులో ప్రతి చిన్న భాగం ముఖ్యమైనదే కాబట్టి ఇలా అవేక్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. గతంలో కూడా ఇలాంటి సర్జరీల కోసం పేషెంట్‌కు బాహుబలి 2 సినిమా చూపించడం, వయొలిన్ వాయించాలని చెప్పడం, గిటార్ ప్లే చేయించడం లాంటి పనులను డాక్టర్లు సూచించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News