సోషల్ మీడియా కన్వీనర్ గా పాతులోతు మేష్యా నాయక్
దిశ, దామరచర్ల: నల్గొండ జిల్లా వైఎస్సార్ తెలంగాణ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ గా పాతులోతు మేష్యా నాయక్ ను నియమిస్తూ ఆ పార్టీ అధికారికంగా ఉత్తర్వులు జారీచేసింది. ఈ సందర్భంగా సోమవారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. తన మీద నమ్మకంతో పార్టీ సోషల్ మీడియా విభాగం కన్వీనర్ గా నియమించిన పార్టీ అధినేత్రి షర్మిలకు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని తెలిపారు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం కావాలంటే […]
దిశ, దామరచర్ల: నల్గొండ జిల్లా వైఎస్సార్ తెలంగాణ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ గా పాతులోతు మేష్యా నాయక్ ను నియమిస్తూ ఆ పార్టీ అధికారికంగా ఉత్తర్వులు జారీచేసింది. ఈ సందర్భంగా సోమవారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. తన మీద నమ్మకంతో పార్టీ సోషల్ మీడియా విభాగం కన్వీనర్ గా నియమించిన పార్టీ అధినేత్రి షర్మిలకు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని తెలిపారు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం కావాలంటే సోషల్ మీడియా విభాగం క్రియాశీలకమని అన్నారు.
ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా నాయకులు, కార్యకర్తలు తమ శక్తి సామర్థ్యాల మేరకు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజన్న రాజ్యం ఏర్పాటు చేయడానికి రంగంలోకి దిగిన షర్మిలను ధీరవనితగా అభివర్ణించారు. గతంలో జగనన్నకు నీడగా పాదయాత్ర చేశారని, గళం విప్పి తోడుగా నిలిచారని కొనియాడారు. నేడు అన్నను వీడి సొంతకాళ్లపై నిలబడడానికి రాజన్న బాట పట్టారని వివరించారు. తన నియామకానికి సహకరించిన జిల్లా పార్టీ కన్వీనర్, రాష్ట్ర కమిటీ బాధ్యులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.