ఆర్టీసీ బస్టాండ్ లో అవస్థలు.. ప్రయాణికులకు తప్పని తిప్పలు
దిశ, ఇందల్వాయి: ఇందల్వాయి బస్టాండ్ ఆవరణలో భారీవర్షాలు కురవడంతో నీరు నిలిచిపోయాయి. నిత్యం ప్రయాణికులతో రద్దీగా వుండే బస్టాండ్ ఆవరణలో నీరు నిలవడం పట్ల ప్రయాణికులు ఇబ్బందులకు గురౌతున్నారు. బస్టాండ్ అధికార సిబ్బంది పట్టించుకోకపోవడం పట్ల ప్రయాణికులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క బస్టాండ్ ఆవరణ ముందర భాగంలో నీరు నిలవడంతో ఆ కాలనీవాసులు, షాప్ నిర్వహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీరు నిలవడంతో సాయంత్రం దోమలు ఎక్కువగా చేరుతున్నాయని, వాటి వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. […]
దిశ, ఇందల్వాయి: ఇందల్వాయి బస్టాండ్ ఆవరణలో భారీవర్షాలు కురవడంతో నీరు నిలిచిపోయాయి. నిత్యం ప్రయాణికులతో రద్దీగా వుండే బస్టాండ్ ఆవరణలో నీరు నిలవడం పట్ల ప్రయాణికులు ఇబ్బందులకు గురౌతున్నారు. బస్టాండ్ అధికార సిబ్బంది పట్టించుకోకపోవడం పట్ల ప్రయాణికులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క బస్టాండ్ ఆవరణ ముందర భాగంలో నీరు నిలవడంతో ఆ కాలనీవాసులు, షాప్ నిర్వహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీరు నిలవడంతో సాయంత్రం దోమలు ఎక్కువగా చేరుతున్నాయని, వాటి వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. దీనికి తోడు మార్కెట్ అక్కడే నిర్వహిస్తుండడంతో సంతకు వచ్చేవారు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా బస్టాండ్ అధికార సిబ్బంది స్పందించి ప్రయాణికుల, ప్రజల ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నారు.