మహిళలపై సింగర్ లైంగిక వేధింపులు.. సపోర్ట్ చేసిన హీరోయిన్
దిశ, సినిమా : టాలెంటెడ్ హీరోయిన్ పార్వతి తిరువొతు లేటెస్ట్ పోస్ట్ ద్వారా క్షమాపణలు చెప్పింది. మహిళలను లైంగికంగా వేధించినందుకు క్షమాపణలు చెప్తూ పాపులర్ మలయాళ రాపర్ వేదన్ పెట్టిన అపాలజీ పోస్ట్‌కు లైక్ కొట్టడంపై ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చింది. రాపర్ వేదన్‌పై ఆరోపణల తర్వాత డైరెక్టర్ ముహ్సిన్ పరారీ, తనతో వీడియో సాంగ్ అగ్రిమెంట్‌ను వెనక్కితీసుకున్నాడు. దీంతో రియలైజ్ అయిన రాపర్.. ‘డియర్ ఆల్.. నా తప్పులు సరిదిద్దుకునేందుకు చేస్తున్న సిన్సియర్ పోస్ట్ ఇది. నన్ను నమ్మివచ్చిన […]
దిశ, సినిమా : టాలెంటెడ్ హీరోయిన్ పార్వతి తిరువొతు లేటెస్ట్ పోస్ట్ ద్వారా క్షమాపణలు చెప్పింది. మహిళలను లైంగికంగా వేధించినందుకు క్షమాపణలు చెప్తూ పాపులర్ మలయాళ రాపర్ వేదన్ పెట్టిన అపాలజీ పోస్ట్‌కు లైక్ కొట్టడంపై ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చింది. రాపర్ వేదన్‌పై ఆరోపణల తర్వాత డైరెక్టర్ ముహ్సిన్ పరారీ, తనతో వీడియో సాంగ్ అగ్రిమెంట్‌ను వెనక్కితీసుకున్నాడు. దీంతో రియలైజ్ అయిన రాపర్.. ‘డియర్ ఆల్.. నా తప్పులు సరిదిద్దుకునేందుకు చేస్తున్న సిన్సియర్ పోస్ట్ ఇది. నన్ను నమ్మివచ్చిన ఉమెన్ ఫ్రెండ్స్ అండ్ పార్టనర్స్‌తో తప్పుగా ప్రవర్తించినందుకు రిగ్రెట్ అవుతున్నా. ఈ బాధ అనుభవించేందుకు నేను అర్హుడిని’ అంటూ పోస్ట్ పెట్టాడు.
ఈ పోస్ట్‌కు లైక్ కొట్టిన పార్వతి.. క్షమాపణలు కోరింది. తను ఆ పోస్ట్‌ను లైక్ చేయడం వెనకాల ఉన్న ఉద్దేశాన్ని వివరించింది. మహిళలపై లైంగికవేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న రాపర్ వేదన్‌కు సపోర్ట్ ఇచ్చినందుకు బాధితులకు క్షమాపణలు చెప్తున్నానన్న పార్వతి.. చాలా మంది పురుషులు తాము తప్పు చేశారని ఒప్పుకోరని, కానీ వేదన్ మాత్రం ఒప్పుకున్నాడని అందుకే తన పోస్ట్‌కు లైక్ కొట్టానని చెప్పింది. బాధిత మహిళలు సమాజంలో గౌరవించబడటం ఇప్పుడు ముఖ్యమన్న ఆమె.. త్వరలోనే రాపర్ పోస్ట్‌పై లైక్‌ను తొలగిస్తానని చెప్పింది.