తాటి కల్లు తాగిన చిలకమ్మా.. రుచి ఎలాగుందో చెప్పమ్మా!!
దిశ, పర్వతగిరి: మే అయినా రాలేదు ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి రాకముందే భానుడు చుక్కలు చూపుతున్నాడు. ఈ ఎండలకు పశుపక్ష్యాదులు నీటికోసం యాతన పడుతున్నాయి. నీరు దొరకని పరిస్థితిలో దాహం తీర్చుకోవడానికి కల్లును సైతం అమృతంలా తాగుతున్నాయి. తాజాగా వరంగల్ లో నీళ్లు తాగి సేద తీరాల్సిన చిలుకలు తాటికల్లు తాగుతూ కెమెరా కంటికి చిక్కాయి. అన్నారం షరీఫ్ ధూప తండ గ్రామం తాటి వనం లో రామచిలుకలు కల్లు తాగుతూ స్థానికులను ఆశ్చర్య పరుస్తున్నాయి. ఎంచక్కా […]
దిశ, పర్వతగిరి: మే అయినా రాలేదు ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి రాకముందే భానుడు చుక్కలు చూపుతున్నాడు. ఈ ఎండలకు పశుపక్ష్యాదులు నీటికోసం యాతన పడుతున్నాయి. నీరు దొరకని పరిస్థితిలో దాహం తీర్చుకోవడానికి కల్లును సైతం అమృతంలా తాగుతున్నాయి. తాజాగా వరంగల్ లో నీళ్లు తాగి సేద తీరాల్సిన చిలుకలు తాటికల్లు తాగుతూ కెమెరా కంటికి చిక్కాయి. అన్నారం షరీఫ్ ధూప తండ గ్రామం తాటి వనం లో రామచిలుకలు కల్లు తాగుతూ స్థానికులను ఆశ్చర్య పరుస్తున్నాయి. ఎంచక్కా కల్లుముంతపై వాలి వాటి ముక్కుతో పొడిచి కల్లుతో దాహాన్ని తీర్చుకుంటున్నాయి.ఇక కల్లు కోసం వస్తున్న రామచిలుకలు చూడడానికి గ్రామస్థులు తాటి చెట్లవద్దకు తరలివస్తున్నారు.