ఈ నెల 14న పార్లమెంటు సమావేశాలు..!

దిశ వెబ్‎డెస్క్: కరోనా వ్యాప్తి దృష్ట్యా అత్యంత జాగ్రత్తల మధ్య ఈ నెల 14వ తేదీన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో లోక్‎సభ, రాజ్యసభ సభ్యులకు ఆయా సెక్రటరీలు కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు. సభలోకి ప్రవేశించే ప్రతి ఎంపీ, వారి వ్యక్తిగత సిబ్బందితో పాటు పార్లమెంటు ఉద్యోగులందరూ కరోనా టెస్టులు చేయించుకున్న రిపోర్టులు తప్పనిసరిగా ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 11 నుంచి ఆర్టీ-పీసీఆర్ రిపోర్టులు తీసుకురావాలని సూచించారు. రిపోర్టులు లేని వారిని […]

Update: 2020-09-04 07:57 GMT

దిశ వెబ్‎డెస్క్: కరోనా వ్యాప్తి దృష్ట్యా అత్యంత జాగ్రత్తల మధ్య ఈ నెల 14వ తేదీన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో లోక్‎సభ, రాజ్యసభ సభ్యులకు ఆయా సెక్రటరీలు కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు. సభలోకి ప్రవేశించే ప్రతి ఎంపీ, వారి వ్యక్తిగత సిబ్బందితో పాటు పార్లమెంటు ఉద్యోగులందరూ కరోనా టెస్టులు చేయించుకున్న రిపోర్టులు తప్పనిసరిగా ఆదేశాలు జారీ చేశారు.

సెప్టెంబర్ 11 నుంచి ఆర్టీ-పీసీఆర్ రిపోర్టులు తీసుకురావాలని సూచించారు. రిపోర్టులు లేని వారిని లోపలకు అనుమతించబోమని స్పష్టం చేశారు. ఎంపీ వ్యక్తిగత సిబ్బంది, కుటుంబసభ్యులకు కరోనా ఉన్నట్లయితే సదరు ఎంపీలు పార్లమెంటుకు రాకూడదని తెలిపారు. మరోవైపు పార్లమెంట్ ప్రాంగణంలో 40 చోట్ల టచ్‎లెస్ శానిటైజర్లను ఏర్పాటు చేయనున్నారు.

Tags:    

Similar News