ఆక్రమణలకు అడ్డేది..?
దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: అక్రమార్కులను సహించేది లేదు, వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు అని మున్సిపల్ అధికారులు చెబుతున్న మాటలకు, చేస్తున్న పనులకు పొంతన లేకుండా పోయింది. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 297 వెంచర్లలో పార్కు జాగాలు ఆక్రమణకు గురయ్యాయి. కబ్జా చేసిన స్థలాల్లో అక్రమ నిర్మాణాలు రాత్రికి రాత్రే వెలుస్తున్నాయి. మున్సిపల్ అధికారులు తూతూమంత్రంగా అప్పటికప్పుడు తాత్కలిక చర్యలు తీసుకోని బోర్డులు పాతి మళ్లీ అటువైపు మళ్లి చూడటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రూ.1,000కోట్ల విలువచేసే […]
దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: అక్రమార్కులను సహించేది లేదు, వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు అని మున్సిపల్ అధికారులు చెబుతున్న మాటలకు, చేస్తున్న పనులకు పొంతన లేకుండా పోయింది. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 297 వెంచర్లలో పార్కు జాగాలు ఆక్రమణకు గురయ్యాయి. కబ్జా చేసిన స్థలాల్లో అక్రమ నిర్మాణాలు రాత్రికి రాత్రే వెలుస్తున్నాయి. మున్సిపల్ అధికారులు తూతూమంత్రంగా అప్పటికప్పుడు తాత్కలిక చర్యలు తీసుకోని బోర్డులు పాతి మళ్లీ అటువైపు మళ్లి చూడటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రూ.1,000కోట్ల విలువచేసే పార్కు జాగాలు కబ్జాకు గురయ్యాయంటూ జనవరి 5న దిశ పత్రికలో ప్రముఖంగా ప్రచురితం అయింది. తుర్కయంజాల్ రెవెన్యూ పరిధి రాగన్నగూడ సర్వే నెంబర్ 536, 537, 505, 657 & 658 సుప్రీతానగర్‌లో పార్కు స్థలం కబ్జాకు గురైనట్లు పేర్కొనడం జరిగింది.
దిశ పత్రిక కథనాలకు స్పందించిన మున్సిపల్ అధికారులు హుటాహుటిన పార్కు స్థలంలో మున్సిపల్ బోర్డులు పాతి వచ్చారు. అనాటి నుంచి మళ్లీ అటువైపు మళ్లి చూసిన పాపాన పోలేదు. ఇదే అదును గా ఆక్రమణదారుడు యథేచ్ఛగా బోర్డును పీకేసి షెడ్డులో తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దీంతో వెంచర్‌లోని ప్లాట్ల యజమానులు అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్, మున్సిపల్ కమిషనర్ షఫీ ఉల్లా దృష్టికి తీసుకెళ్లారు. పార్కు స్థలంలో వెలసిన గేదెల షెడ్డును వెంటనే తొలగించి, పార్కు రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. గేదెల షెడ్డును వెంటనే తొలగించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. అయినా మున్సిపల్ అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. చిన్నచిన్న రేకుల షెడ్డు వేసుకునే పేదలపై ప్రతాపం చూపే అధికారులు, ఇంత పెద్ద మొత్తంలో పార్కు జాగాల ఆక్రమణకు పాల్పడుతుంటే ఎందుకు ఉపేక్షిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటివరకు సుమారు 14 పార్కు స్థలాల్లో మున్సిపల్ అధికారులు బోర్డులు పాతి మళ్లీ అటువైపు తిరిగి చూడటంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ప్రహరీ నిర్మిస్తాం..
సుప్రీతానగర్ వెంచర్ వాసులు ఫిర్యా దు చేసిన మాట వాస్తవమే. పార్కు స్థలాల రక్షణకు మేం కట్టుబడి ఉ న్నాం. పార్కు స్థలాలు మళ్లీ కబ్జాలకు గురికాకుండా వాటి చుట్టూ కాంపౌం డ్ వాల్ ని ర్మాణం చేపట్టాలని నిర్ణ యించాం. ఇందుకోసం భారీగా నిధు లు అవసరం అవుతున్నాయి. కాంపౌం డ్‌వాల్స్ నిర్మాణానికి గత కౌన్సిల్ సమావేశంలో రూ.3కోట్లు అవసరమ ని తీర్మానం పెట్టాం. అందులో రూ.కో టి పనులకు కౌన్సిల్ ఆమోదించింది. రెండుమూడు రోజుల్లో టెండర్లు పిలిచి కాంపౌండ్ వాల్ నిర్మాణపనులను ప్రారంభిస్తాం. – అహ్మద్ షఫీ ఉల్లా, మున్సిపల్ కమిషనర్
బోర్డు తొలగించిన వారిపై క్రిమినల్ కేసులు పెడతాం..
సుప్రీతానగర్ వెంచర్‌లో ఆక్రమణకు గురైన పార్కు స్థలంలో పాతిన మున్సిపల్ బోర్డును తొలగించినవారిపై క్రిమినల్ కేసులు పెడ తాం. మున్సిపాలిటీ పరిధి లో వారంలో రెండు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుంటున్నాం. ఇప్పటికే 14 పార్కుల్లో మున్సిపల్ బోర్డులు పెట్టిం చాం. అనేక అక్రమ నిర్మాణాలను పడగొ ట్టించాం. సుప్రీతా నగర్ వెంచర్‌లో ఆక్రమణకు గురైన పార్కు స్థలంలో గేదెల షెడ్డును ఏర్పాటు చేశారు. గేదెలకు ఇబ్బం ది కలగకూడదనే మానవతా దృక్పథంతోనే ఆ షెడ్డును కూల్చలేదు.
-ఉమ, టౌన్ ప్లానింగ్ అధికారి