‘మానవమృగాలకు బతికే అర్హత లేదు’
దిశ, వెబ్‌డెస్క్: ఓ మైనర్ బాలిక అత్యాచార ఘటనను టీడీపీ యువ నేత పరిటాల శ్రీరామ్ తీవ్రంగా ఖండించారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదని ఉరి శిక్ష వేయాలని ఆయన ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. రాజమండ్రిలో 12 ఏళ్ల బాలికపై 4 రోజుల పాటు క్రూరంగా రాక్షసత్వంతో 7 గురు మానవ మృగాలు అత్యాచారం చేశారన్నారు. అనంతరం ఏకంగా పోలీస్ స్టేషన్ ముందే వదిలేసారంటే ఎంత ధైర్యం ఉంటే ఇంతటి అఘాయిత్యానికి పాల్పడి ఉండాలి అంటూ […]
దిశ, వెబ్‌డెస్క్: ఓ మైనర్ బాలిక అత్యాచార ఘటనను టీడీపీ యువ నేత పరిటాల శ్రీరామ్ తీవ్రంగా ఖండించారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదని ఉరి శిక్ష వేయాలని ఆయన ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. రాజమండ్రిలో 12 ఏళ్ల బాలికపై 4 రోజుల పాటు క్రూరంగా రాక్షసత్వంతో 7 గురు మానవ మృగాలు అత్యాచారం చేశారన్నారు. అనంతరం ఏకంగా పోలీస్ స్టేషన్ ముందే వదిలేసారంటే ఎంత ధైర్యం ఉంటే ఇంతటి అఘాయిత్యానికి పాల్పడి ఉండాలి అంటూ ప్రశ్నించారు. ఇలాంటి మానవమృగాలకు అసలు సమాజంలో బతికే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కామాంధులకు వెంటనే ఉరిశిక్ష వేసి స్త్రీ మూర్తులకు భద్రత , భరోసా కల్పించాలన్నారు.