పాకిస్తాన్ సైనికుల దుశ్చర్య.. ఒకరు మృతి
పూంచ్: పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో గల లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్‌ఓసీ) వద్ద కాల్పులకు తెగబడింది. 10 జేఏకే రైఫిల్స్‌కు చెందిన హవల్దార్ హవ్ నిర్మల్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతిచెందారు. ‘గురువారం పూంచ్ జిల్లా కృష్ణఘాటి సెక్టార్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్‌ఓసీ) దగ్గర కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడింది. వెంటనే తేరుకున్న భద్రతా బలగాలు గట్టి సమాధానం ఇచ్చాయి. ఎదురుకాల్పుల్లో 10 జేఏకే రైఫిల్స్‌కు […]
పూంచ్: పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో గల లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్‌ఓసీ) వద్ద కాల్పులకు తెగబడింది. 10 జేఏకే రైఫిల్స్‌కు చెందిన హవల్దార్ హవ్ నిర్మల్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతిచెందారు. ‘గురువారం పూంచ్ జిల్లా కృష్ణఘాటి సెక్టార్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్‌ఓసీ) దగ్గర కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడింది. వెంటనే తేరుకున్న భద్రతా బలగాలు గట్టి సమాధానం ఇచ్చాయి. ఎదురుకాల్పుల్లో 10 జేఏకే రైఫిల్స్‌కు చెందిన హవల్దార్ హవ్ నిర్మల్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ మృతిచెందారు’ అని ఆర్మీ అధికారిక ప్రకటనలో తెలిపింది.