టిక్‌టాక్‌పై వెనక్కి తగ్గిన పాకిస్థాన్ !

దిశ, వెబ్‌డెస్క్: టిక్‌టాక్‌ యాప్‌పై నిషేధం విధించి పట్టుమని 10రోజులు గడవక ముందే పాకిస్థాన్‌ బ్యాక్‌ స్టెప్ వేసింది. అనైతిక, అసభ్యకర సమాచారాన్ని తొలగిస్తామని టిక్‌టాక్ యాజమాన్యం స్పష్టం చేయడంతో దేశంలో మళ్లీ టిక్‌టాక్‌ను పునరుద్ధరిస్తున్నట్లు పాకిస్థాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ తెలిపింది. టిక్‌టాక్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రెండు నెలల ముందే పీటీఏ వార్నింగ్ ఇచ్చింది. అయినా టిక్‌టాక్ కేర్ చేయకపోవడంతో పీటీఏ అక్టోబర్ 9న బ్యాన్‌ చేసింది. దీంతో వెంటనే రియాక్ట్ అయిన టిక్‌‌టాక్ యాజమాన్యం సంతృప్తి […]

Update: 2020-10-19 11:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: టిక్‌టాక్‌ యాప్‌పై నిషేధం విధించి పట్టుమని 10రోజులు గడవక ముందే పాకిస్థాన్‌ బ్యాక్‌ స్టెప్ వేసింది. అనైతిక, అసభ్యకర సమాచారాన్ని తొలగిస్తామని టిక్‌టాక్ యాజమాన్యం స్పష్టం చేయడంతో దేశంలో మళ్లీ టిక్‌టాక్‌ను పునరుద్ధరిస్తున్నట్లు పాకిస్థాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ తెలిపింది. టిక్‌టాక్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రెండు నెలల ముందే పీటీఏ వార్నింగ్ ఇచ్చింది. అయినా టిక్‌టాక్ కేర్ చేయకపోవడంతో పీటీఏ అక్టోబర్ 9న బ్యాన్‌ చేసింది. దీంతో వెంటనే రియాక్ట్ అయిన టిక్‌‌టాక్ యాజమాన్యం సంతృప్తి కరంగా సమాధానం చెప్పడంతో యాప్‌‌ను మళ్లీ పునరుద్ధరిస్తున్నట్లు పీటీఏ తెలిపింది. దీంతో మరోసారి చైనా, పాకిస్థాన్ ఫ్రెండ్ షిప్ బయట పడిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News