పింఛన్లకు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోండి: ఉప సభాపతి తీగుల్ల పద్మారావు
దిశ, సికింద్రాబాద్: 57 సంవత్సరాల వయస్సు నిండిన వారికి సైతం వృద్దాప్య ఆసరా పించన్ల అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు జరుపుతోందని, అర్హులైన వారు ఈ నెల 30వ తేదీలోగా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ సూచించారు. వృద్దాప్య పింఛన్ల దరఖాస్తులను మీ సేవా కేంద్రాల్లో స్వీకరిస్తున్నారని ఆయన బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు స్వయంగా మీ సేవా కేంద్రాలకు వెళ్ళాల్సి ఉంటుందని, తమతో రేషన్ కార్డ్ /బ్యాంకు […]
దిశ, సికింద్రాబాద్: 57 సంవత్సరాల వయస్సు నిండిన వారికి సైతం వృద్దాప్య ఆసరా పించన్ల అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు జరుపుతోందని, అర్హులైన వారు ఈ నెల 30వ తేదీలోగా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ సూచించారు. వృద్దాప్య పింఛన్ల దరఖాస్తులను మీ సేవా కేంద్రాల్లో స్వీకరిస్తున్నారని ఆయన బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు స్వయంగా మీ సేవా కేంద్రాలకు వెళ్ళాల్సి ఉంటుందని, తమతో రేషన్ కార్డ్ /బ్యాంకు పాస్ పుస్తకం/ఆధార్ కార్డు/ఓటర్ గుర్తింపు కార్డు జిరాక్స్ ప్రతులు, పాస్ పోస్ట్ ఫోటోలు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ఉచితంగానే దరఖాస్తులు స్వీకరిస్తారని తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు.