తీవ్ర ఇబ్బందులంటూ నిజామాబాద్ ఆర్ఎంకు వినతి

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ రీజియన్ పరిధిలోని ఆర్టీసీ అద్దెబస్సుల బకాయిలు నాలుగు నెలలుగా ఇవ్వలేదని, దీంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని యజమానులు వాపోయారు. బుదవారం బకాయిలు చెల్లించాలంటూ అద్దెబస్సు యజామానుల జిల్లా సంక్షేమ సంఘం తరుపున ఆర్ఎం సోలమాన్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సంధర్బంగా నాయకులు సంజీవ్ రావు మాట్లాడుతూ… తమకు ఫిబ్రవరి నెల నుంచి రీజియన్ పరిధిలో బస్సుల అద్దెల బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. […]

Update: 2020-06-17 03:51 GMT

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ రీజియన్ పరిధిలోని ఆర్టీసీ అద్దెబస్సుల బకాయిలు నాలుగు నెలలుగా ఇవ్వలేదని, దీంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని యజమానులు వాపోయారు. బుదవారం బకాయిలు చెల్లించాలంటూ అద్దెబస్సు యజామానుల జిల్లా సంక్షేమ సంఘం తరుపున ఆర్ఎం సోలమాన్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సంధర్బంగా నాయకులు సంజీవ్ రావు మాట్లాడుతూ… తమకు ఫిబ్రవరి నెల నుంచి రీజియన్ పరిధిలో బస్సుల అద్దెల బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అద్దె బిల్లులు రాక సమ్మె కాలం తరువాత డ్రైవర్లు, క్లీనర్ల వేతనాలు ఇవ్వలేకపోతున్నామని, మెయింటనెన్స్ తో పాటు ఈఎంఐలు కట్టలేని పరిస్థితి నెలకొందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, సత్యనారయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గోన్నారు.

Tags:    

Similar News