మా భూమి లేకపోతే మేము లేము.. దయచేసి మా పొట్ట కొట్టొద్దు

దిశ, ములుగు : మా భూమి మాకిచ్చి న్యాయం చేయాలని మాసపాక భిక్షపతి కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన మాసపాక భిక్షపతి ములుగు తహశీల్దార్ తమకు అన్యాయం చేశాడని ఆరోపించారు. తమను అడగకుండా మా భూమిలో అన్యాయంగా పెట్రోల్ బంకులు వేస్తున్నారని, ప్రభుత్వం మాకు అన్యాయం చేయొద్దంటూ భిక్షపతి తన కుటుంబసభ్యులతో కలిసి తనకు చెందిన భూమి వద్దే దీక్షకు దిగాడు. శనివారానికి ఈ నిరసన దీక్ష 13వ రోజుకు […]

Update: 2021-10-16 12:04 GMT

దిశ, ములుగు : మా భూమి మాకిచ్చి న్యాయం చేయాలని మాసపాక భిక్షపతి కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన మాసపాక భిక్షపతి ములుగు తహశీల్దార్ తమకు అన్యాయం చేశాడని ఆరోపించారు. తమను అడగకుండా మా భూమిలో అన్యాయంగా పెట్రోల్ బంకులు వేస్తున్నారని, ప్రభుత్వం మాకు అన్యాయం చేయొద్దంటూ భిక్షపతి తన కుటుంబసభ్యులతో కలిసి తనకు చెందిన భూమి వద్దే దీక్షకు దిగాడు. శనివారానికి ఈ నిరసన దీక్ష 13వ రోజుకు చేరుకుంది.

ఈ సందర్భంగా భిక్షపతి మాట్లాడుతూ.. అయ్యా నేను దళితుడిని. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం మాది.హమాలీ కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నాము.మాకు అన్యాయం చేయవద్దు. దయచేసి మా భూమిలో వేయాలనుకున్న పెట్రోల్ బంకులు ఉపసంహరించుకోవాలి. మా ఇంట్లోని ఆడబిడ్డలు ఏడుస్తున్నారు. ములుగు ఎమ్మార్వో సత్యనారాయణ గారు, ములుగులో కావలసినంత లావూణి పట్టా భూమి ఉంది. దానిని స్వాధీనపరచుకొని అందులో పెట్రోల్ బంక్ పెట్టుకోవాలని కోరారు.

మా భూమిలో నిలిపిన పెట్రోల్ ట్యాంక్‌లను వెంటనే తొలగించి, మా భూమి మాకు ఇప్పించి న్యాయం చేయాలని ఈ సందర్భంగా భిక్షపతి ఎమ్మార్వోను కోరారు. అదేవిధంగా, అయ్యా మాకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యను కోరారు. ఈ దీక్షలో కుటుంబ సభ్యులు మాసపాక సారమ్మ, సందీప్, హరిత, స్వప్న, స్వర్ణలత పాల్గొన్నారు.

Tags:    

Similar News