కరోనాకు సొంతవైద్యం చేసుకున్నాడు.. ప్రాణాలు విడిచాడు
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ భయమేమోగానీ దాని చికిత్స గురించి వస్తున్న వాట్సాప్ ఫార్వర్డులు మరింత బెంబేలెత్తిస్తున్నాయి. ఇదే చేస్తే తగ్గుతుంది, అది చేస్తే పోతుంది అంటూ వాట్సాప్ ఫార్వర్డులు తెగ ఇబ్బంది పెడుతున్నారు. వీటిని చాలా మంది పట్టించుకోకపోయినా, కొందరు మాత్రం గుడ్డిగా పాటిస్తున్నారు. జలుబు దగ్గులను కూడా కరోనా అనుకుని సొంతవైద్యం చేసుకుని ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇలా సొంతవైద్యం చేసుకుని అమెరికాలోని అరిజోనాలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సార్స్ వైరస్‌ని అరికట్టగలిగే […]
దిశ, వెబ్‌డెస్క్:
కరోనా వైరస్ భయమేమోగానీ దాని చికిత్స గురించి వస్తున్న వాట్సాప్ ఫార్వర్డులు మరింత బెంబేలెత్తిస్తున్నాయి. ఇదే చేస్తే తగ్గుతుంది, అది చేస్తే పోతుంది అంటూ వాట్సాప్ ఫార్వర్డులు తెగ ఇబ్బంది పెడుతున్నారు. వీటిని చాలా మంది పట్టించుకోకపోయినా, కొందరు మాత్రం గుడ్డిగా పాటిస్తున్నారు. జలుబు దగ్గులను కూడా కరోనా అనుకుని సొంతవైద్యం చేసుకుని ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇలా సొంతవైద్యం చేసుకుని అమెరికాలోని అరిజోనాలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
సార్స్ వైరస్‌ని అరికట్టగలిగే మలేరియా మందు క్లోరోక్విన్, కరోనా వైరస్‌ని అడ్డుకోవడానికి కూడా పనిచేస్తుందంటూ వచ్చిన ఓ వాట్సాప్ ఫార్వర్డును ఈ అరిజోనా వ్యక్తి నమ్మాడు. ఆదివారం రోజున అతనికి, అతని భార్య కొద్దిగా జలుబు చేసి దగ్గు మొదలైంది. కోవిడ్ పరీక్ష చేయించుకోకుండానే ఇద్దరూ క్లోరోక్విన్ తీసుకున్నారు. దీంతో కాసేపటికే వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైంది. వారిని దగ్గర్లోని బ్యానర్ హెల్త్ హాస్పిటల్‌కి తరలించిన తర్వాత భర్త ప్రాణాలు కోల్పోగా, భార్య పరిస్థితి విషమంగా మారింది. అయితే వాట్సాప్ ఫార్వర్డుల్లో క్లోరోక్విన్ అని స్పష్టంగా చెప్పలేదని, క్లోరోక్విన్ ఆధారంగా తయారు చేసిన హైడ్రాక్సీక్లోరోక్విన్ ద్వారా కొంత ఉపశమనం ఉండొచ్చని చెప్పినట్లు తర్వాత డాక్టర్లు తెలిపారు. అయినప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లో అధికారిక ఆధారాలు లేని మెసేజ్‌లు నమ్మి, సొంత వైద్యం చేసుకోవడం సరికాదని డాక్టర్లు సూచించారు.
Tags: Corona, COVID 19, Own Medicine, Chloroquine, malaria drud, arizona