టీకా ఉత్సవ్ : తొలి రోజు ఎంతమందికి వ్యాక్సిన్ వేశారంటే

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘టీకా ఉత్సవ్’ తొలి రోజు (ఆదివారం) ఘనంగా ప్రారంభమైంది. కొవిడ్ కేసులు పెరుగుతుండటం, వైరస్ వ్యాప్తి కూడా ఎక్కువవుతుండటంతో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌పై ప్రజల్లో అవగాహన పెరిగింది. ఆదివారం రికార్డు స్థాయిలో టీకాలు వేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. టీకా ఉత్సవ్ ప్రారంభమైన తొలిరోజు ఏకంగా 27 లక్షలకు పైగా వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు అందిన వివరాల మేరకు.. ఆదివారం […]

Update: 2021-04-11 22:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘టీకా ఉత్సవ్’ తొలి రోజు (ఆదివారం) ఘనంగా ప్రారంభమైంది. కొవిడ్ కేసులు పెరుగుతుండటం, వైరస్ వ్యాప్తి కూడా ఎక్కువవుతుండటంతో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌పై ప్రజల్లో అవగాహన పెరిగింది. ఆదివారం రికార్డు స్థాయిలో టీకాలు వేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. టీకా ఉత్సవ్ ప్రారంభమైన తొలిరోజు ఏకంగా 27 లక్షలకు పైగా వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు అందిన వివరాల మేరకు.. ఆదివారం దేశవ్యాప్తంగా 27,69,888 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్టు తెలుస్తున్నది. ఇందులో 25,47,691 మంది తొలి డోసు వేసుకోగా.. 2,22,197 మంది రెండో డోసు వేయించుకున్నారు. ఫలితంగా దేశంలో వ్యాక్సిన్ వేసుకున్న వారి సంఖ్య 10 కోట్లు (10,43,65,035) దాటింది.

ఈ నెల 11 నుంచి 14 దాకా టీకా ఉత్సవ్ ను నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా వ్యాక్సిన్ కేంద్రాలను కూడా పెంచింది. ఆదివారం దేశవ్యాప్తంగా 63,800 కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్స్ (సీవీసీ) లలో 27 లక్షలకు మందికి వ్యాక్సిన్లు వేశారు. సాధారణంగా అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైనప్పట్నుంచి ఆదివారాల్లో వ్యాక్సిన్ వేసుకునే వారి సంఖ్య 16 లక్షలకు మించకపోయేదని, కానీ నిన్న మాత్రం ఆ సంఖ్య 27 లక్షలకు పైగా ఉండటం గమనార్హం.

Tags:    

Similar News