ఓటీటీలోకి వచ్చేసిన రెండు సూపర్ హిట్ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడ అవుతున్నాయంటే..?

ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన మూవీ 15 నుంచి 20 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుండంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు.

Update: 2025-03-21 06:13 GMT
ఓటీటీలోకి వచ్చేసిన రెండు సూపర్ హిట్ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడ అవుతున్నాయంటే..?
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన మూవీ 15 నుంచి 20 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుండంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది సినిమా చూసేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది థియేటర్స్‌ను కాదు అని ఓటీటీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండంతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా సినిమాలను త్వరత్వరగా స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓటీటీలోకి రెండు సూపర్ హిట్ సినిమాలు వచ్చేశాయి. మరి అవేంటో, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం..

రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్:

తమిళ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) హీరోగా నటించిన సినిమా ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’. ఇందులో అనుపమ పరమేశ్వరన్ అలాగే కయాద్ లోహర్ హీరోయిన్లుగా నటించారు. ఇక దీనికి ‘ఓ మై కడవులే’ ఫేమ్ అశ్వత్ మరి ముత్తు(Ashwath Marimuthu) దర్శకత్వం వహించారు. అయితే దీనిని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కల్పాతి ఎస్. అఘోరమ్(Kalpathi S.Aghoram), కల్పాతి ఎస్. గణేష్(Kalpathi S.Ganesh), కల్పాతి ఎస్. సురేష్(Kalpathi S.Suresh) ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా డ్రాగన్ సినిమా ఫిబ్రవరి 21న తమిళం, తెలుగు, మలయాళం వంటి భాషల్లో విడుదలై.. దాదాపు 10 రోజుల్లోనే 100 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయినటువంటి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది.

జాబిలమ్మ నీకు అంత కోపమా:

పవిష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’(Jabilamma Neeku Antha Kopama). కోలీవుడ్ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ ధనుష్(Dhanush) ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అయితే ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా యూత్‌ను బాగా అలరించింది. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌లో రిలీజ్‌ చేశారు. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి వసూళ్లు వచ్చాయి. థియేటర్లలో ఆడియెన్స్‌ను అలరించిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో(amazon Prime Video)లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది.


Read More..

‘అదిదా సర్‌ప్రైజ్’స్టెప్‌పై స్పందించిన నితిన్.. వారికి లేని సమస్య మీకెందుకంటూ షాకింగ్ కామెంట్స్  


Tags:    

Similar News