నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతున్న సూపర్ హిట్ మూవీ.. అధికారిక ప్రకటన విడుదల

గత కొద్ది కాలంగా చాలా మంది థియేటర్స్‌కు వెళ్లడం లేదు. ఓటీటీలోకి కొత్త సినిమాలు వస్తుండటంతో అంతా ఇంట్లో కూర్చుని ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేస్తున్నారు.

Update: 2024-09-02 10:01 GMT

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా చాలా మంది థియేటర్స్‌కు వెళ్లడం లేదు. ఓటీటీలోకి కొత్త సినిమాలు వస్తుండటంతో అంతా ఇంట్లో కూర్చుని ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇటీవల వచ్చిన ఎన్నో మూవీస్ పెద్దగా మెప్పించనప్పటికీ.. ఓటీటీలోకి వచ్చాక ఊహించని రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా, ఓ ఇంట్రెస్టింగ్ టీనేజ్ లవ్ స్టోరీ రానున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. రంగోలి పేరుతో విడుదలైన తమిళ మూవీ సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.

అయితే దీనిని తెలుగులో సత్య పేరుతో శివ మల్లాల రిలీజ్ చేశాడు. ఈ సినిమాకు వాలీ మోహన్ దాస్ దర్శకత్వం వహించగా.. ఇందులో హమరేశ్, ప్రార్థన సందీప్, మురుగదాస్, సాయి శ్రీ నటించారు. అయితే ఇది మే 10న తెలుగులో రొమాంటిక్ లవ్ స్టోరీతో విడుదలై మెప్పించింది. ఇప్పుడు ఈ సత్య సినిమా విడుదలైన నాలుగు నెలల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. వినాయక చవితి నాడు ఆహా ఓటీటీలో సెప్టెంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఆహా ట్విట్టర్ వేదికగా అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

 


Similar News